లింగ సమానత్వంను పెంపొందించాలి

లింగ సమానత్వంను పెంపొందించాలి

లింగ సమానత్వంను పెంపొందించాలిప్రజాశక్తి – క్యాంపస్‌ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్రం రీసెర్చ్‌ అసోసి యేట్‌ డాక్టర్‌ ఇ కోనప్రభ స్థానిక శ్రీ కోదండరామ హైస్కూ ల్లోని 9వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు బుధవారం లింగ వివక్షత పై అవగాహన నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కోన ప్రభ మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీలు, పురుషు లతో సమానంగా అన్ని రంగా ల్లోనూ రాణిస్తున్నప్పటికీ ,తరతరా లుగా సమాజంలో పాతుకు పోయిన లింగ వివక్ష కారణంగా స్త్రీలు అనేక అవరోధాలు, అన్యా యాలు, హింసను ఎదుర్కొంటు న్నారన్నారు. గర్భస్థ దశ నుండి చనిపోయే వరకు జీవితంలో గల అన్ని దశల లోనూ స్త్రీలు లింగ వివక్షకు గురవుతున్నారన్నారు. లింగ వివక్షత పై సమగ్ర అవగాహన పెంపొందించుకొని లింగ సమానత్వ సాధన దిశగా విద్యార్థులు చైతన్యవంతం కావా లని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో విద్యార్థులకు వివిధ అభ్యాసాల ద్వారా లింగ వివక్షత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యయన కేంద్ర రీసర్చ్‌ అసిస్టెంట్స్‌ డాక్టర్‌ .ఎం .ఇంద్రాణి, వి.ప్రీతి, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యా యులు, విద్యార్థులు, తదితరులు పా ల్గొన్నారు.

➡️