విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పూరిల్లు

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పూరిల్లు

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధంప్రజాశక్తి -దొరవారిసత్రం: నిరుపేద గిరిజనులు నివాస ముంటున్న పూరిల్లు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ తో కాలి బూడిద అయిన సంఘ టన మండల పరిధి లోని పూల తోట గిరిజన కాలనీలో మంగళ వారం వెలుగు లోకి వచ్చింది. బాధితు ల కథనం మేరకు మానికల శ్రీనివాసు లు పేద రికంలో కూలి పనుల పైనే ఆధారపడి జీవిస్తున్నాడు. ఇల్లు నిర్మించుకోలేక పూరి ఇంటిలోనే నివసిస్తున్నాడు. భార్యతో కలిసి కూలి పనికి వెళ్లాడు. అదే సమయంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసిపడి పూరిల్లు కాలి బూడిదయింది. అందులో తన కూలి పని చేసి కూడ పెట్టుకున్న పదివేల రూపాయల నగదు, చిన్నపాటి బంగారు కమ్మలు తోపాటు, ఫ్రిజ్‌, బీరువా, దుస్తులు, వంట సామగ్రి కాలి బూడిదైందని ఆవేదన వ్యక్తం చేశాడు. నష్టపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

➡️