శాస్త్రీయ ఆలోచనతోనే అభివృద్ధి

Dec 21,2023 22:17
శాస్త్రీయ ఆలోచనతోనే అభివృద్ధి

ప్రజాశక్తి – రేణిగుంట మండలంలో చెకుముకి పోటీలు బాలుర పాఠశాలలో జరిగాయి. 16 ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పిహెచ్‌సి డాక్టర్‌ చత్రప్రకాష్‌ మాట్లాడుతూ సైన్స్‌ అభివృద్ధితోనే మానవుడు తన ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచుకున్నాడన్నారు. మూఢనమ్మకాల వల్ల ఆరోగ్యాన్ని, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. శాస్త్రీయ దృక్పథం అలవరచుకుంటేనే అభివృద్ధి అన్నారు. జెవివి మండల కార్యదర్శి కుప్పస్వామి, నాయకులు నాగరాజు, ఒ.వెంకటరమణ, లెక్కల టీచర్‌ అల్లాబక్ష్‌ ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలుర పాఠశాల విద్యార్థుల బృందం, ప్రైవేట్‌ పాఠశాలల్లో రెయిన్‌బో స్కూల్‌ బృందం మొదటిస్థానంలో నిలిచాయి. వీరు జనవరి 7న తిరుపతి సైన్స్‌ సెంటర్‌ వద్ద జరగనున్న జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ప్రజాశక్తి-పుత్తూరుటౌన్‌: పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, బాలికల పాఠశాలలో జనజ్ఞజ్ఞాన వేదిక అధ్యర్యంలో చెకుముకి సైన్స్‌ సంబరాల్లో భాగంగా గురువారం మండల స్థాయి టాలెంట్‌ పరిక్ష నిర్వహించారు. ఎంఈవో తిరు మలరాజు, బాలనుబ్రమణ్యం పాల్గొని విద్యార్థులకు సైన్స్‌ ఆవశ్యకతను వివ రించారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో మండల స్థాయిలో మొదట స్థా నంలో జ్ఞానజ్యోతి విద్యామందిర్‌ విద్యారులు రిషికేష్‌, రిషిత, ప్రత్యూష, రెం డవస్థానంలో జెడ్పి ఉన్నత పాఠశాల వేపగుంట విద్యార్థులు హాసిని, లిఖిత, తేజేష్‌ మూడవ స్థానంలో వివేకానంద విద్యార్థులు ధనుష్‌, చరణ్‌తేజ్‌, కావ్య లకు బహుమతులు అందజేసారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక పుత్తూరు డివిజన్‌ ప్రధానకార్యదర్శి విజయనాగు, భువనేశ్వరి, ఉపాధ్యాయులు నరేంద్ర, సుధారాణి, షకీల, కీలు, వేలు, వెంకటేశులు, రమేష్‌, వనజాక్షి పాల్గొన్నారు. బుచ్చినాయుడు కండ్రిగ: మండలంల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో గురువారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగిన మండల స్థాయి చెకుముకి ప్రశ్నాపత్రాలను హెచ్‌ఎం రమణయ్య విడుదల చేశారు. పరీక్షలో విజేతలుగా నిలిచిన జెడ్పి హైస్కూలు నెలవాయి విద్యార్థులు ఆకాష్‌, దీప, హిమజ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు కార్తీక్‌, మేఘన, విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైయ్యారు. వీరికి ఎంఈవో రవీంద్రనాధ్‌, మునిసుబ్రమణ్యం బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో చెంగయ్య, వెంకటరమణయ్య, సురేష్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

➡️