సనాతన హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయం : టిటిడి ఛైర్మన్‌

సనాతన హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయం : టిటిడి ఛైర్మన్‌

సనాతన హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయం : టిటిడి ఛైర్మన్‌ప్రజాశక్తి – తిరుమల సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసమే తిరుమలలో శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సును మూడు రోజుల పాటు నిర్వహించినట్లు టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఉద్ఘాటించారు. అరవై మంది పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు, సలహాలతో సదస్సు తీసుకున్న 19 తీర్మానాలను మీడియాకు వెల్లడించారు. సదస్సు నిర్వహణలో టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి, జెఇఒలు సదా భార్గవి, వీరబ్రహ్యం కృషిని ప్రశంసించారు. 1933లో టిటిడి పాలకమండలి ఏర్పడిందని, దాస సాహిత్య ప్రాజెక్టు, మాతశ్రీ తరిగొండ వెంగమాంబ వాజ్మయ ప్రాజెక్ట్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, అళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, నాలాయిర దివ్యప్రభంధ ప్రాజెక్ట్‌, శ్రీనివాస కల్యాణోత్సవ శ్రీవేంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్టుల ద్వారా ధార్మిక ప్రచార కార్యక్రమాలు విస్తతంగా జరుగుతున్నాయని చెప్పారు. హైందవ సనాతన ధర్మాన్ని , సంస్కతి, సాంప్రదాయాలను పరిరక్షించాలనే సదాశయంతో ఇలాంటి ప్రాజెక్టులను టీటీడీ అమల్లోకి తెచ్చిందని వివరించారు. ఎస్వీబీసీ ఛానల్‌ ప్రస్తుతం నాలుగు భాషలలో అద్వితీయంగా, దాదాపు 8 కోట్ల మంది వీక్షకులతో భక్తులందరినీ అలరింపజేస్తోందన్నారు. ఇతర మతస్తులు హిందూ మతాన్ని స్వీకరించడానికి ఆసక్తి చూపితే స్వాగతించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తిరుపతిని సంపూర్ణ ఆధ్యాత్మిక వాతావరణం, భక్తి భావన కలిగేలా ఏర్పాటు చేయాలని తీర్మానించారు. గో సంరక్షణ అత్యావశ్యకతగా సదస్సు తీర్మానించిందన్నారు. పాఠ్య ప్రణాళికల్లో హిందూ ధర్మ ప్రాధాన్యతకు పెద్ద పీట వేయాలని, ఇందుకోసం ధర్మ ప్రబోధ కాలైన ప్రణాళికలు అవసరమని తీర్మానం చేసినట్టు చెప్పారు.

➡️