స్విమ్స్‌లో అతిధి ఉపన్యాసం

Jan 24,2024 23:12
స్విమ్స్‌లో అతిధి ఉపన్యాసం

ప్రజాశక్తి- తిరుపతి సిటీ: స్విమ్స్‌ కార్డియోథొరాసిక్‌ విభాగంచే ఆరోగ్య సంరక్షణలో నాణ్యత మెరుగుదల అనే అంశంపై స్విమ్స్‌ శ్రీపద్మావతి ఆడిటోరియంలో అతిధి ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంచాలకులు డాక్టర్‌ ఆర్‌వి.కుమార్‌ మాట్లాడుతూ వైద్యులు, రోగుల ఆరోగ్య వివరాలు పొందుపరచడంలో సులభతరం చేయడానికి, ఆరోగ్య సంరక్షణ విధానాన్ని మెరుగుపరచడానికి, లోపాలను తగ్గించడానికి ఈ ఆరోగ్య సంరక్షణ విధానం చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. డాక్టర్‌ ఇందు డెగ్లూకర్‌ యుకె. నుండి వచ్చి తను చేసిన సర్జరీల అనుభవాలను మనతో పంచుకోవడం ఆనందదాయకంగా వుందన్నారు. ముఖ్యఅతిధిగా యూనివర్శిటి హాస్పిటల్‌ ఆఫ్‌ వేల్స్‌, యుకెకి చెందిన ప్రముఖ కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఇందు డెగ్లూకర్‌ ఆరోగ్య సంరక్షణలో నాణ్యత మెరుగుదల అనే అంశంపై వివరిస్తూ.. ఆరోగ్య సంరక్షణ నాణ్యత అనేది పేషంట్స్‌ అవసరాల కోసం ప్రత్యేకమైన వైద్య సేవలను అందించడం, పేషంటు ఎటువంటి జాప్యం జరగకుండా మరణాల రేటు తగ్గించడం, వైద్య విధానంలో ఉత్తమ పద్ధతులను, క్లినికల్‌ ప్రాక్టీస్‌, మెడికల్‌ ప్రాక్టీస్‌ అందించి పేషంట్లు ఆరోగ్యాన్ని కాపాడే విధంగా వైద్యులు వైద్యం అందించాల్సిన అవసరం వుంటుందని, పలు అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వైద్య విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ అపర్డ ఆర్‌ బిట్ల, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌, సిటి సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ వినోద్‌ భాను, డాక్టర్‌ వనజాక్షమ్మ, డాక్టర్‌ మాధవి, కమ్యూనిటి మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ నాగరాజు, డాక్టర్‌ ప్రాణబంధు దాస్‌, డాక్టర్‌ సుచిత్ర, వైద్యులు, వైద్య విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️