హామీల వి'(ఎ)స్మ’రణ’ఎస్మా’ నోటీసులు దగ్ధం26వ రోజూ అంగన్‌వాడీల సమ్మెరిలే నిరాహారదీక్షలు ప్రారంభంకళ్లకు గంతలతో శిబిరాల్లో నిరసన

హామీల వి'(ఎ)స్మ'రణ'ఎస్మా' నోటీసులు దగ్ధం26వ రోజూ అంగన్‌వాడీల సమ్మెరిలే నిరాహారదీక్షలు ప్రారంభంకళ్లకు గంతలతో శిబిరాల్లో నిరసన

హామీల వి'(ఎ)స్మ’రణ’ఎస్మా’ నోటీసులు దగ్ధం26వ రోజూ అంగన్‌వాడీల సమ్మెరిలే నిరాహారదీక్షలు ప్రారంభంకళ్లకు గంతలతో శిబిరాల్లో నిరసనప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, యంత్రాంగంరాష్ట్రంలో అంగన్వాడీలకు వర్తించని ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం ద్వారా వారిని భయపెట్టాలనుకోవడం ప్రభుత్వ మూర్ఖత్వమని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి హెచ్చరించారు. అత్యవసర పనులుగా భావించబడే నీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా, ఆసుపత్రుల్లో ఎస్మా చట్టం వర్తిస్తుందని, అత్యవసర పనులకు ఏమాత్రం సంబంధం లేని అంగన్వాడీలపై ప్రయోగించడం చూస్తుంటే ప్రభుత్వ పిరికితనం అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. శనివారం జిల్లా కేంద్రమైన తిరుపతిలో రిలే నిరాహారదీక్ష ప్రారంభమయ్యింది. జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల నుంచి వచ్చిన నాయకులతో నిరాహారదీక్షలను అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.వాణీశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రకేంద్రంలోనూ, జిల్లాలోనూ రిలేనిరాహారదీక్షలుపెద్దఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ప్రాజెక్టు స్థాయిలో దీక్షా శిబిరాలు కొనసాగుతాయని వెల్లడించారు. తిరుపతి సిడిపిఒకు నిరసన సెగ తిరుపతి ప్రాజెక్టు సిడిపిఓ సుధారాణి కి అంగన్వాడీల నిరసన సెగ తగిలింది. ఎస్మా చట్టానికి సంబంధించిన ప్రతులను అంగన్వాడీలకు అందించడానికి శనివారం సాయంత్రం దీక్షా శిబిరం దగ్గరకు వచ్చిన సిడిపిఓ సుధారాణిని అంగన్వాడీలు పెద్ద ఎత్తున చుట్టుముట్టి నిరసన తెలిపారు సమస్యలు పరిష్కరించకుండా నోటీసులు ఇవ్వడం ఏంటని నినాదాలు చేశారు. సిడిపిఓ ప్రతులను ఇవ్వాలని విఫల యత్నం చేసి అంగన్వాడీలు నోటీసులు తీసుకోకపోవడంతో చేసేది లేక మౌనంగా వెనుదిరిగారు.కళ్లకు గంతలతో నిరసనఅంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని, చీకటి చట్టాలతో ఉద్యమాలను ఆపలేరని తెలుపుతూ అంగన్వాడీలు నల్లటి రిబ్బన్‌తో కళ్ళకు గంతలు కట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మొదటిరోజు రిలే నిరాహార దీక్షలో వివిధ ప్రాజెక్టుల నుంచి విచ్చేసిన అంగన్వాడీ నేతలు భాగ్యలక్ష్మి, రాజేశ్వరి, సౌజన్య, పుష్ప, రేవతి, గంగా, ధనమ్మ, హైమావతి, శాంతి, సిఐటియు నగర కార్యదర్శి వేణుగోపాల్‌, నేతలు టి. సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రసంగించారు.- శ్రీకాళహస్తిలో సిపిఎం జిల్లాకార్యదర్శి వందవాసి నాగరాజు సంఘీభావం ప్రకటిస్తూ సిఎం జగన్‌ ‘నీరో చక్రవర్తి’లా రాష్ట్రం తగలబడుతుంటే వేడుక చూస్తున్నారని విమర్శించారు. 26 రోజులుగా సుదీర్ఘ పోరాటం చేస్తుంటే ఎస్మా జీవో నంబర్‌2ను ప్రయోగించడం దుర్మార్గమన్నారు. జీవో కాపీలను దహనం చేశారు. జగన్‌నిర్మిస్తున్న ప్యాలెస్‌కు రూ.450 కోట్లు ఖర్చు పెట్టే బదులు మరో రూ.50 కోట్లు జత చేసి అంగన్‌వాడీల వేతనాలు పెంచితే సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారని సూచించారు. నాయకులు అంగేరి పుల్లయ్య, గంధం మణి, పెనగడం గురవయ్య, రాజా, రేవతి, పుష్ప, సౌజన్య పాల్గొన్నారు. – గూడూరు టౌన్‌లో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. అంగన్‌వాడీలు 26 రోజులుగా సమ్మెచేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదన్నారు. ఇంద్రావతి, జోగి శివకుమార్‌, సురేష్‌, బి.వి రమణయ్య పాల్గొన్నారు. – పిచ్చాటూరులో నల్లరిబ్బన్లను కట్టుకుని, జీవో కాపీలను తగలబెట్టారు. అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడం చట్టవిరుద్దమని సిఐటియు నాయకులు నాగరాజు, యూనియన్‌ నాయకులు ఇంద్రాణి, రాజేశ్వరి అన్నారు. – నాయుడుపేటలో ఎస్మా చట్టం జీవో 2 కాగితాలను దహనం చేశారు. సిఐటియు నాయకులు శివకవి ముకుంద, అంగన్‌వాడీ ప్రాజెక్టు నాయకురాలు ఎన్‌.శ్యామలమ్మ, నాగమణి, కళావతి, సంధ్య, వాణి, చెంగమ్మ, విజయమ్మ పాల్గొన్నారు. – పుత్తూరులో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటేష్‌ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింది. అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద నడిరోడ్డులో భోజనాలు చేశారు. జీవో కాపీలను దహనం చేశారు. విజయకుమారి, మోహన్‌లక్ష్మి, అన్నపూర్ణ, హైమావతి,లలిత తదితరులు పాల్గొన్నారు. – రేణిగుంటలో నల్లరిబ్బన్లు కట్టుకుని, మోకాళ్లపై నిరసన తెలిపారు. నాయకులు హరినాథ్‌, సెల్వరాజ్‌, మురళి, నర్శింహారెడ్డి, కుప్పస్వామి, ఒ.వెంకటరమణ మద్దతు తెలిపారు.- సత్యవేడులో నల్లరిబ్బన్లతో నిరసన తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పు మేరకే సమ్మె జరుగుతోందన్నారు. కాంతమ్మ, భారతి, ఝాన్సీ, నాగరాజు, స్వర్ణలత, గీత పాల్గొన్నారు. – వెంకటగిరిలో సిఐటియు నాయకులు వడ్డిపల్లిచెంగయ్య, అంగన్‌వాడీ ప్రాజెక్టు నాయకులు ఎ.మంజుల, జ్యోతి, ఉమ, సుభాషిణి, ప్రియ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింది. – తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎస్మా ప్రయోగం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హరినాథరెడ్డి మండిపడ్డారు.

➡️