18-20 తేదీల్లో వీఆర్‌ఏల రిలే దీక్ష

18-20 తేదీల్లో వీఆర్‌ఏల రిలే దీక్ష

18-20 తేదీల్లో వీఆర్‌ఏల రిలే దీక్షప్రజాశక్తి-శ్రీకాళహస్తి గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏలు) సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 18, 19, 20వ తేదీల్లో విజయవాడ వేదికగా చేపడుతున్న రిలే దీక్షలను జయప్రదం చేయాలని వీఆర్‌ఏల సంఘం జిల్లా కార్యదర్శి సుబ్బయ్య పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో బుధవారం వీఆర్‌ఏల సంఘం నాయకులు సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ కార్యకలాపాలు సాగించడంలో గ్రామ రెవెన్యూ సహాయకులదే కీలక పాత్రనీ, అయితే వారికిచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం అన్యాయమని వాపోయారు. వీఆర్‌ఏల చేత గొడ్డు చాకిరీ చేయించుకుంటూ వారికి కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వమని కోరితే జగన్‌ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందంటూ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అంగేరి పుల్లయ్య మండిపడ్డారు. వీఆర్‌ఏలను రెగ్యులర్‌ చేయాలని కోరారు. వీఆర్‌ఏల సంఘం నాయకులు చుక్కల కష్ణయ్య, అంకయ్య, శిరీష, రామ్మూర్తి, సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️