ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు.

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు.

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు.ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌ : మూడవ రోజు పి వి కె యన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జసాగిందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం ఆర్‌ ఓ పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వుల తో ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించడంతో మూడవ రోజు మంగళవారం ఉదయం నుండి అత్యవసర సేవలు అందించే వైద్య ఆరోగ్య,పోలీస్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖల తో పాటు వీడియో, ఫొటోగ్రాఫర్స్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు త్వరగా ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ధృవ పత్రాలను పరిశీలించి వేగవంతంగా ఓటింగ్‌ ప్రక్రియ ను చేయాలని పోలింగ్‌ సిబ్బందిని ఆదేశించారు.ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకొని ఓటర్లకు తాగునీరు మజ్జిగ, స్నాక్స్‌ తో పాటుగా మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేశామని తెలిపారు.

➡️