అంగన్వాడీ ఉద్యమం స్ఫూర్తిదాయకం మేడే స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధం కావాలి యూనియన్‌ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు పిలుపు

అంగన్వాడీ ఉద్యమం స్ఫూర్తిదాయకం మేడే స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధం కావాలి యూనియన్‌ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు పిలుపు

అంగన్వాడీ ఉద్యమం స్ఫూర్తిదాయకం మేడే స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధం కావాలి యూనియన్‌ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు పిలుపు ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం 42 రోజులు చేసిన సమ్మెలో భాగంగా చిత్తూరు జిల్లాలో కూడా విరోచితమైన పోరాటాలు చేయడం అభినందనీయమని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవ అధ్యక్షులు వాడ గంగరాజు కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సమ్మె ఒక ఎత్తు అయితే చిత్తూరు జిల్లాలో ముగ్గురు బలమైన మంత్రులుంటూ అంగన్వాడీల సమ్మెను రకరకాల పద్ధతుల్లో అనచడానికి ప్రయత్నాలు చేసిన వాటిని అధిగమించి అంగన్వాడీలు సమ్మెలో పాల్గొనడం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ సమ్మె సందర్భంగా పలు రకాల ఆందోళన కార్యక్రమాలకు యూనియన్‌ పిలుపునివ్వగా ఆ పోరాటాలను అంగన్వాడీలు అదరక బెదరక దిగ్విజయంగా విజయవంతం చేశారు. కుప్పం ప్రాజెక్టులో రాజకీయ కక్షతో ఇద్దరు కార్యకర్తలను టెర్మినేషన్‌ చేసి ఇదే పద్ధతి జిల్లా వ్యాప్తంగా అందర్నీ టెర్మినేషన్‌ చేస్తామని చెప్పి బెదిరించినప్పటికీ కుపంలో జిల్లాలోని 100 శాతంసమ్మె కొనసాగించి ఆదర్శవంతంగా నిలిచారు. మంత్రులు నియోజకవర్గంలో అంగన్వాడీలను రకరకాల పద్ధతుల్లో బెదిరింపులకు పాల్పడిన తమ సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేసి తీరుతామని తెగేసి చెప్పారు. మహిళలుగా ఉంటూ మహిళా సత్తా ఏంటో చూపించిన పరిస్థితి అంగన్వాడీలది. కలెక్టరేట్‌ వద్ద 24 గంటలు రాత్రింబగళ్లు చేసిన దీక్షలు అమోఘం. రాత్రుల్లో కూడా వందలాది మంది మహిళలు అక్కడే ఉండి పోరాటం చేయడం జిల్లాలో ఉన్న ఉద్యోగ కార్మికులను ప్రభావితం చేసిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసినప్పటికీ వర్షంలో తడుస్తూనే దీక్షలు చేయడం మహిళా కార్మికుల చేసిన పోరాటం విరోచితం. కలెక్టరేట్‌ ముట్టడి సందర్భంగా జిల్లాలో ఎక్కడిక్కడ అంగన్వాడీలను రానీయకుండా కట్టడం చేసినప్పటికీ అధికారుల ఎత్తులను చిత్తు చేస్తూ ముందు రోజే చిత్తూరుకు చేరుకోవడం అంగన్వాడీల సత్తా ఏంటో చూపించారు. పోరాటం చేస్తే ఇలా చేయాలి అని అంగన్వాడీలు చేసి చూపించారు. కలెక్టరేట్‌ ముట్టడికి పోలీసులు ఎన్ని రకాలుగా అడ్డుకున్నప్పటికీ గేట్లు తోసుకొని కలెక్టరేట్లో చొరబడిన చరిత్ర అంగన్వాడీలది. ఈ పోరాటంలో వందలాది మంది గాయపడినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా లోపలికి చొరపడ్డారు. ప్రభుత్వం అధికారులు అంగన్వాడీల నోటీసులు ఇస్తాం టెర్మినేషన్‌ చేస్తాం అని బెదిరించినా చివరికి 1100 మంది టెర్మినేషన్‌ చేసిన వెనక్కి తగ్గకుండా చలో విజయవాడ కార్యక్రమానికి 1000 మంది హాజరై పోరాట పటిమను చాటారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎన్నో రకాలుగా నిర్బంధాలు గురిచేయడంతో అంగన్వాడీలు వాటిని అధిగమించిన పరిస్థితి ఉంది. ఇంత విరుద్ధతమైన పోరాటం చేసినప్పటికీ ప్రభుత్వం అధికారులు మళ్ళీ రకరకాల పద్ధతుల్లో అంగన్వాడీలపై ఒత్తిడి తీసుకువస్తూ అమసులు పరిష్కారం చేయకుండా ఇబ్బందులు కురిచేస్తున్నారు ఎఫ్‌ఆర్‌ ఎస్‌ చేయాలని తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. వీటిని అన్నిటిని ఐక్యంగా ఎదుర్కోవడమే మార్గమని అంగన్వాడీలు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు.ఎస్మా చట్టం ప్రయోగం ఎస్మా అనేది భారత పార్లమెంట్‌ చట్టం అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా కేంద్రం లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సందర్భాల్లో అమలు చేయడానికి రూపొందించుకున్న చట్టం. ఇది పేరుకు ఏం చెప్పినా సమ్మెలను కార్మిక ఉద్యమాలను అంది వేయడానికి పాలకులు తయారు చేసుకున్న అస్త్రం ఇది. 1968లో రూపొందించిన ఈ చట్టం 1971, 1981, 1985, 1990, 2013లలో పలు మార్పులు చేయబడిందిజ ఈ చట్టప్రకారం నిర్దేశించిన రంగం లేదా ప్రాంతంలో కనీసం ఆరు నెలలపాటు సభ్యులు చేయడానికి వీలు ఉండదు ఒకవేళ సమ్మె చేస్తే వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయవచ్చు, సమ్మెలో పాల్గొంటున్న వారితో పాటు వారిని ప్రోత్సహిస్తున్న వారిని పేరుతో ఎవరినైనా నిర్బంధించవచ్చు. తనకు దేశంలో ఎదురులేదని భావించిన ఇందిరా గాంధీ సర్కార్‌ 1971 చట్టాన్ని ఉపయోగించి 16 సంస్థల్లో కార్మికుల సమ్మెను నిషేధించింది రైల్వే కార్మికులపై ఎస్మా నాసా చట్టాలను ప్రయోగించి వారి సమ్మెను అణచివేయాలని చూసింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరగడంతో దేశం మొత్తం ఎమర్జెన్సీని విధించింది, నియంతగా వ్యవహరించింది, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీనే కాదు ఆమె కూడా ఓటమి చూడాల్సి వచ్చింది. ఆనాడు పోరాడిన కార్మికులు కోల్పోయిన హక్కులను ఉద్యోగాలను తిరిగి సాధించుకొని చరిత్రలు నిలిచిపోయారు. మన రాష్ట్రంలో కూడా విద్యుత్‌, ఆర్టీసీ కార్మికుల సమ్మె చేసిన సమయంలో నాటి ప్రభుత్వం ఈ ఎస్మాని ప్రయోగించి పోలీసులు ద్వారా సమ్మె శిబిరాలను తొలగించింది. ప్రదర్శనలు నిషేధించింది. చివరకు కార్మికు ఉద్యమానికి తలంచి చర్చలు జరిపే ఆయా రంగాల కార్మికుల డిమాండ్లను పరిష్కారం వచ్చింది. మన జీవితకాలంలో కేంద్రంలో నరేంద్ర మోడీ చారిత్రాత్మకమైన రైతాంగ ఉద్యమాన్ని ఎంతగా అణిచి పెట్టాలని చూసారో ఎన్ని రకాలుగా దుష్ప్రచారం చేశారో చూశాం. చివరకు జరిగింది ఏమిటి? దేశ ప్రజలకు ఆ ప్రధానే క్షమాపణ చెప్పుకోవాల్సిన వచ్చింది. అదే ఉద్యమాల బలం… దాన్ని గుర్తించిన నిరాకరిస్తే ఆ పాలకులు గతే ఈ ప్రభుత్వానికి పడుతుంది. ఉడత ఊపులతో తాటాకు చప్పులతో కార్మిక వర్గాన్ని భయపెట్టి లొంగ తీసుకోవాలని పాలకుల దుర్భిది. పాలకులు ఎవరైనా వారి బుద్ధి కార్మిక కష్టజీవులు అణిచివేయడమే అందుకు వైసీపీ మినహాయింపు కాదని రుజువైంది. నేడు అంగన్వాడీలు ఎవరైనా ఈచట్టానికి గురికావాల్సి వస్తుంది. అందుకే ఎస్మా చట్ట ప్రయోగానికి వ్యతిరేకంగా తమ డిమాండ్ల సాధనకు పోరాడుతున్న పోరాడిన అంగన్వాడీ, మున్సిపల్‌, ఎస్‌ఎస్సి కార్మికులు చరిత్రలో నిలిచిపోతారు. ఈ పోరాటాలన్నీ కూడా కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తితో నిరంతరం కొనసాగుతున్నాయి. పాలకులు కూడా నిరంతరం కార్మిక చట్టాలపై కార్మికులపై దాడులు చేస్తూనే ఉన్నారు. కార్మిక చట్టాలు రద్దు చేస్తున్నారు, మరోసారి మే డే స్ఫూర్తితో అంగన్వాడీ పోరాటస్ఫూర్తితో జిల్లాలో కూడా కార్మికవర్గం మరో పోరాటానికి సిద్ధం కావాలని సిఐటియు పిలుపునిస్తున్నది.

➡️