దళితునిపై దాడి దారుణం : కెవిపిఎస్‌

దళితునిపై దాడి దారుణం : కెవిపిఎస్‌

దళితునిపై దాడి దారుణం : కెవిపిఎస్‌ప్రజాశక్తి – గూడూరు టౌన్‌ గూడూరుకు పొట్ట చేత పట్టుకొని కూలీ పనికి వచ్చిన దళిత కులానికి చెందిన బల్లవోలు నారాయణపై దాడి చేసిన ఎస్కే కాలేషా పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. బల్లవోలుకు చెందిన నారాయణ శుక్రవారం గూడూరు రెండో పట్టణంలోని చింపిరి నాయుడు కాల్వ వద్ద ఓ ఇంటికి దారి తలుపు బిగించేందుకు పనికి వెళ్లాడు. అక్కడ సవక నరుకుతుండగా అదే ప్రాంతానికి చెందిన కాలేషా ఇక్కడ ఏమి చేస్తున్నావ్‌ అంటూ దాడికి పాల్పడ్డాడు. తాను తమ యజమాని తలుపు బిగించేందుకు సవక నరుకుతున్నానని చెప్పినా వినకుండా కులం పేరుతో దూషించాడు. అక్కడే ఉన్న గడ్డపారతో పొడిచేందుకు ప్రయత్నించగా యజమాని వచ్చి కాపాడారు. 100కి ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. ఈ విషయమై శుక్రవారం రెండవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో గూడూరు డివిజన్‌ కె.వి.పి.ఎస్‌ నాయకులు అడపాల ప్రసాద్‌, జోగి శివకుమార్‌ కె.శ్రీనివాసులు బాధితునితో కలిసి ఫిర్యాదు చేశారు.

➡️