తిరుపతి- చెన్నై మధ్య ‘వందే భారత్‌’

  • తిరుపతి- చెన్నై మధ్య ‘వందే భారత్‌’రెండు నెలలు ట్రయల్‌ రన్‌ నిర్వహణ

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ : వందే భారత్‌ రైళ్లకు మనదేశంలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. సుదూర ప్రాంతాలకు వేగంగా తీసుకెళ్లే సౌలభ్యం ఉండటంతో ప్రయాణికుల నుంచి వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను తీసుకువస్తున్న భారతీయ రైల్వే.. వీటితో పాటు వందే భారత్‌ మెట్రో రైళ్లను కూడా ప్రవేశపెడుతోంది. ఇప్పటికే చెన్నైలోని రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలో ఇవి రూపుదిద్దుకున్నాయి. వచ్చే జులై నుంచి వందే భారత్‌ మెట్రో రైళ్లు పరుగులు పెట్టే అవకాశం ఉండగా.. ఆంధ్రప్రదేశకు కూడా వందే మెట్రోను కేటాయిస్తారని సమాచారం. ఏపీలోని తిరుపతి, తమిళనాడులోని చెన్నై నగరాల మధ్య వందే భారత్‌ మెట్రో రైలును నడపనున్నట్లు సమాచారం. జులై నెలలో ట్రయల్‌ రన్‌ కూడా చేపట్టనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. రెండు వారాల ట్రయల్‌ రన్‌ పూర్తైన తర్వాత పూర్తిస్థాయిలో తిరుపతి- చెన్నై మార్గంలో నడపాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే చెన్నై- తిరుపతి మధ్య వందే మెట్రో రైళ్లు నడిపేందుకు రెండు నెలలు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఇదివరకే వందే భారత్‌ రైళ్లు అందుబాటులో ఉండగా, 200 కి.మీ పరిధిలో ఉన్న నగరాలను అనుసంధానిస్తూ ఈ ఏడాది వందే మెట్రో రైళ్లు నడిపేందుకు భారత రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈవిషయమై అధికారుల సమాచారం… ఈ ఏడాది చివరిలోగా ఈ రైలు అందుబాటులోకి తీసుకురానున్నామని, ఒకటి, రెండు నెలల్లో వీటి ట్రయల్‌ రన్‌ ప్రారంభించనున్నామని అన్నారు. ఒక వందే మెట్రోరైలు మూడు యూనిట్లు ఉంటాయని, ఒక యూనిట్‌ నాలుగు పెట్టెలు కలిగి ఉంటుందని తెలిపారు. మొదట 12 పెట్టెలతో నడిపి అవసరమైతే 16 పెట్టెలతో నడుపుతామన్నారు. తిరుపతి- చెన్నై మార్గంలో నడిచే ఒక వందే మెట్రోరైలు మూడు యూనిట్లు ఉంటాయని, ఒక యూనిట్‌ నాలుగు పెట్టెలు కలిగి ఉంటుందని తెలిపారు. మొదట 12 పెట్టెలతో నడిపి అవసరమైతే 16 పెట్టెలతో నడుపుతామన్నారు. మొదట ఏ మార్గంలో ఈ రైళ్లు నడపాలన్న ఖరారు కాలేదని, అయినప్పటికీ, ఢిల్లీ- రేవారి రూట్లో మొదటి మెట్రో నడిపే అవకాశాలున్నాయని తెలిపారు. అలాగే, చెన్నె- తిరుపతి మధ్య నడిపే మెట్రోరైళ్ల ట్రయల్‌ రన్‌ రెండు నెలల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి- చెన్నై మధ్య తమిళ భక్తుల సంఖ్య ఎక్కువ మంది రైళ్లల్లో ప్రయాణిస్తూ ఉంటారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రైళ్ళను ఆశ్రయిస్తుంటారు. వందే మెట్రో రైల్‌ తిరుపతి చెన్నై మధ్య నడపాలని తమిళ భక్తుల డిమాండ్‌ చేయడంతో రైల్వే బోర్డు ఈ దిశగా చర్యలు చేపట్టనుంది. ప్రయాణికులను రద్దీని బట్టి వందే భారత్‌ మెట్రో రైలు బోగీలు పెంచాలని ఆలోచన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

➡️