పోరాటాలకు బాసటగా.. సిపిఎం విరాళాల సేకరణ

Feb 3,2024 16:07 #Tirupati
cpm donation campaign in tpt

ప్రజాశక్తి – తిరుపతి సిటి : పేదల పోరాటాలకు బాసటగా ఉంటున్న సిపిఎంకు విరాళాలిచ్చి ఆదరించాలని సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు హరికిషోర్‌, జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం తిరుపతి ప్రగతి నగరంలో ‘సిపిఎం విరాళాల సేకరణ’ను ప్రారంభించారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు గంటపాటు ఆ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించగా ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సందర్భంగా వందవాసి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో సిపిఎం చేసిన పోరాటాలను వివరించారు. తాజాగా అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, విఒఎలు, ఎస్‌ఎస్‌ఎలు చేసిన ఉద్యమాలకు అండగా సిపిఎం ఉందన్నారు. దీర్ఘకాలికంగా మూడేళ్ల పాటు టిటిడి అటవీ కార్మికులు రిలే, నిరాహారదీక్షలు చేసి ఘననీయమైన విజయం సాధించారన్నారు. టిటిడి ఉద్యోగులకు ఇళ్లస్థలాలు దీర్ఘకాలికంగా చేసిన పోరాటాల ఫలితమేనని గుర్తు చేశారు. కార్మిక, కర్షక, ఉద్యోగ ఉపాధ్యాయులకు అండగా నిలుస్తున్న సిపిఎంకు ఆర్థికంగా విరాళాలిచ్చి, పోరాటాలకు అండదండలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్‌.లక్ష్మి, హేమలత, రవి, ఎ.వనజ, సిఎస్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️