కోడ్ ఆఫ్ కండక్ట్ ను అతిక్రమించరాదు

Apr 8,2024 16:31 #Tirupati district

కలెక్టర్ ప్రవీణ్ కుమార్
ప్రజాశక్తి – తిరుపతి(మంగళం): సార్వత్రిక ఎన్నికలు-2024పై తిరుపతి జిల్లా కలెక్టరేట్ లోని వీసి ఛాంబర్ లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. నేటి నుండి ఎన్నికల సంఘానికి మద్యం నమ్మకాలపై రోజువారి రిపోర్టును పంపుతున్నాం. 2013 తో పోల్చుకుంటే మద్యం అమ్మకాల చాలా పెరిగాయని, ఇప్పటివరకు మద్యం అమ్మకాలు పెరిగిన ప్రాంతాలను గుర్తిస్తున్నాము. ఈ ఎస్ఎంఎస్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన వివరాలను అబ్జర్వర్కు పంపుతున్నాము. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాష్ట్ర సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేస్తున్నాము. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను ఇప్పటికే గుర్తించడం జరిగిందని , వల్నరబల్ పోలింగ్ కేంద్రాలు చంద్రగిరిలో ఏడు గుర్తించామన్నారు. ఈ ఏడు పోలింగ్ కేంద్రాల్లో 2019లో రీపోలింగ్ జరిగింది. తిరుపతి జిల్లా పరిధిలో మొత్తం 2130 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాము. తిరుపతి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలలో మోడల్ పోలింగ్ స్టేషన్ లు ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్, యూత్ పోలింగ్ స్టేషన్లు రెండు, స్త్రీలకు ఒకటి, పిడబ్ల్యుడి వారికి రెండు ఏర్పాటు చేసాము.

వాహన తనిఖీల్లో పట్టుబడ్డ నగదుపై 17 కేసులను నమోదు చేసి 57 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నాము. అందులో సరైన ఆధారాలు చూపిన ఏడు కేసులను రిలీజ్ చేసి 15 లక్షల 88 వేల రూపాయలను తిరిగి అందించడం జరిగింది. వాణిజ్య పన్నుల శాఖ ఒక కేసు నమోదు చేసి 17 లక్షల 27 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు వచ్చిన దానిపై స్పందించి చర్యలు తీసుకున్నాము. అందులో విధుల నిమిత్తం వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగులను ఫోటో తీసి కూడా సి విజిల్ యాప్ లో అప్లోడ్ చేశారని కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ తెలిపారు. బైండ్ ఓవర్ కేసులు ఏకపక్షంగా నమోదు చేయడం లేదు.  సువిధ పోర్టల్ ద్వారా సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతులు తీసుకోవాలని, నిర్దేశించిన శబ్దానికి అంటే ఎక్కువగా వాహనాల్లో, అనౌన్స్మెంట్ మైక్ లలో అధిక శబ్దాలు వచ్చేలా సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని, అట్టి వాహనాలపై కూడా చర్యలు ఉంటాయని ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేస్తుందని, ఎన్నికల విధుల్లో ఉండే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ప్రశాంతంగా పోలింగ్, కౌంటింగ్ జరగడానికి సహకరించాలని సూచించారు.

➡️