తిరుపతిలో గ్రామీణ బంద్ జయప్రదం

Feb 16,2024 12:32 #Tirupati
farmers rural bandh against modi govt tpt

మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టిన పలు ట్రేడ్ యూనియన్
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమం తిరుపతిలో విజయవంతంగా నిర్వహించారు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి వివిధ ట్రేడ్ యూనియన్లు ప్రజా సంఘాలు అంగన్వాడి ఆటో ,హమాలి వర్కర్స్, రేణిగుంట ఇళ్ల సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి సర్కిల్ వద్ద సాగింది .దాదాపు మూడు గంటలసేపు వాహనాలు ఎక్కడికి అక్కడే ఆగిపోయాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, రైతు సంఘం జిల్లా నాయకులు ఏ రామానాయుడు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉందని విమర్శించారు. ఢిల్లీలో రైతులు శాంతియుతంగా ఆందోళన చేయడానికి పూనుకుంటే వారిపై భాష వాయు ప్రయోగించడం దారుణం అన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోడీ అనుకూలంగా వ్యవహరించడం మానుకోవాలన్నారు.టిడిపి జనసేన పార్టీలు మోడీకి కొమ్ము కాసే విధానాన్ని విరమించుకోవాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. రేణిగుంట కరకంబాడి వాసులకు జగనన్న పేరుతో ఇచ్చిన పట్టాలకు స్థలాలు చూపలేదు అన్నారు. వారికి కరకంబడే గుట్ట వద్ద ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ గ్రామీణ బంద్ కార్యక్రమంలో సిఐటియు ఏఐటీయూసీ ఐఎఫ్ఎస్సి వ్యవసాయ కార్మిక సంఘం ఏపీ రైతు సంఘం తో పాటు వివిధ ట్రేడ్ యూనియన్లు ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.

➡️