ఎన్నికల తాయిలాలు పట్టివేత తిరుపతిలో చీరలుతడలో భారీగా మద్యం

May 2,2024 00:16
ఎన్నికల తాయిలాలు పట్టివేత తిరుపతిలో చీరలుతడలో భారీగా మద్యం

ఎన్నికల తాయిలాలు పట్టివేత తిరుపతిలో చీరలుతడలో భారీగా మద్యంప్రజాశక్తి -తిరుపతి సిటి, తడ పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు చేసి ఎన్నికల తాయిలాలను బుధవారం పట్టుకున్నారు. మితిన్‌ రెసిడెన్సీలో నగదు చీరలు పంపిణీ అవుతున్నాయి అన్న సమాచారంతో యూనివర్సిటీ పోలీసులు బుధవారం దాడులు చేశారు. సీల్డ్‌ కవర్లో ఉంచిన నగదు తో పాటు చీరలు ఉన్న మూటను స్వాధీనం చేసుకున్నారు. ఇన్కమ్‌ టాక్స్‌ అధికారుల సమక్షంలో వాటిని పరిశీలించి వెల్లడిస్తామని యూనివర్సిటీ సిఐ మురళీమోహన్‌ వెల్లడించారు.సచివాలయంలో మద్యం కేసులు చంద్రగిరి మండలం ఐతేపల్లిలో వైసిపి సర్పంచి బరితెగించి ఏకంగా సచివాలయంలోనే మద్యం సీసాలను దాచి తాళాలు వేశారని టిడిపి నేతలు గుర్తించి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు ఫిర్యాదు చేశారు. తాళాలు పగలగొట్టి చూడగా మూడు కేసులు ఉన్నాయి. సర్పంచి ఫజిల్లా అంజాద్‌ను ఎన్నికల అధికారులు విచారిస్తున్నారు. నెలరోజులుగా తాళాలు ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శి చంద్రబాబు తెలిపారు. బీవీపాళెం చెక్‌పోస్టు వద్దపెద్దఎత్తున మద్యం పట్టుకున్నారు. ఎస్‌ఇబి అధికారులు తెలిపిన వివరాల మేరకు.. పాండిచ్చేరి నుంచి నెల్లూరు వైపు వెళుతున్న మినీ లారీని తనిఖీ చేయగా భారీగా మద్యం కేసులు లభ్యమయ్యాయి. మినీ లారీ కేరళకు చెందిందని పేర్కొన్నారు. లారీలో మొత్తం 300 కేసులు అనడగా 14,400 క్వార్టర్‌ బాటిళ్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపు 7 లక్షల 42వేలుగా గుర్తించారు. లారీ డ్రైవర్‌ ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ను విచారించగా లారీలో చేపలను రవాణా చేస్తుంటానని, వాహనంలో మద్యం కేసులు పెట్టి ఐస్‌ బాక్సులు ఉన్నాయని, వాటిని నెల్లూరులోని ఓ ఐస్‌ ఫ్యాక్టరీ వద్దకు చేర్చాలని నాలుగువేలు బత్తా ఇచ్చారని తెలిపారు. తనకేమీ తెలియదన్నారు. పట్టుబడిన సరుకు పుదుచ్చేరిలోని బాలాజీ ఎంటర్‌ప్రైజెస్‌ గ్లోబల్‌ బేవరేజస్‌ పరిశ్రమ నుంచి వస్తున్న ఆల్వేస్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ పేరుతో ఉందన్నారు. దీన్ని ఏప్రిల్‌ 30న తయారు చేసినట్లుగా మద్యం బాటిళ్లపై సీలు ఉంది. సిఐ రమేష్‌బాబు, సూళ్లూరుపేట ఎఇ ఎస్‌.రమేష్‌ ఉన్నారు.

➡️