లాస్యను సన్మానించిన రంగస్థలి ఛైర్మన్‌

లాస్యను సన్మానించిన రంగస్థలి ఛైర్మన్‌

లాస్యను సన్మానించిన రంగస్థలి ఛైర్మన్‌ ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)ఇంటర్‌ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వడమాల పేట మండలం, కాయంపేటకు చెందిన లాస్యను రాయలసీమ రంగస్థలి చైర్మన్‌ గుండాల గోపీనాథ్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహంతో ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారని గోపీనాథ్‌ తెలిపారు. లాస్య 1000 మార్కులకు గాను 986 మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. ఈ సత్కార కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కార్యదర్శి రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లాస్య కుటుంబ సభ్యులు మనోహర్‌ రెడ్డి, ప్రభావతమ్మ, సురేఖ తదితరులు పాల్గొన్నారు.

➡️