మూడంచెల భద్రతకౌంటింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్‌

మూడంచెల భద్రతకౌంటింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం ఈవిఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతతోపాటు నిరంతర సిసిటివి పర్యవేక్షణ ఏర్పాట్లు చేశామని, మూడంచెల భద్రత ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. మూడంచెల భద్రతలో భాగంగా మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, రెండవ అంచెలో ఆర్మ్‌ డ్‌ రిజర్వ్‌ పోలీసులు, మూడవ అంచెలో స్ధానిక పోలీసులు 24 గంటలు పాటు రక్షణను పరిశీలించారు. శుక్రవారం ప్రవీణ్‌ కుమార్‌ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాలలో ఫోల్డ్‌ ఈవిఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌ రూమ్‌లను తనిఖీ చేశారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద ఏర్పాటుచేసిన భద్రతా చర్యలను పరిశీలించారు. ఈ సందర్బంగా స్ట్రాంగ్‌ రూమ్‌ భధ్రతా చర్యలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. 23- తిరుపతి(ఎస్‌ సి) పార్లమెంట్‌ నియోజక వర్గం, 7 అసెంబ్లీ నియోజక వర్గం ఈవిఎం స్ట్రాంగ్‌ రూములను పరిశీలించారు. పరిశీలన అనంతరం సందర్శకుల పుస్తకంలో కలెక్టర్‌ సంతకం చేశారు. ఈవిఎంలు అమర్చిన సిసి కెమేరాలు దశ్యాలను సిసిటివి కంట్రోల్‌ రూమ్‌ నందు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్‌ అధికారులు అదితి సింగ్‌, నిషాంత్‌ రెడ్డి, నరసింహులు, అదనపు ఎస్పీ కుల శేఖర్‌, డిఆర్‌ఓ పెంచల కిషోర్‌ పాల్గొన్నారు.

➡️