అందరి కృషితోనే ఘన విజయం : మంత్రి

పజాశక్తి-కొండపి : నాయకులు, కార్యకర్తల కృషి వల్లే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కూటమి ఘన విజయం సాధించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా మర్రిపూడి మండలంలోని రామాయపాలెం గ్రామంలో విద్యుత్‌ ప్రభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని రాష్ట్రాన్ని, జిల్లాను, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని చెప్పారు. ఇప్పటికే ఈ దిశగా ఐదు ప్రాధాన్య అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతకం చేసినట్లు తెలిపారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దామచర్ల సత్య మాట్లాడుతూ అందరి కృషి వల్లే టిడిపి 164 సీట్లు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు ఎమ్మెల్యే స్వామి, దామచర్ల సత్యను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మర్రిపూడి మండల టిడిపి అధ్యక్షుడు నరస్సారెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెడింగ్‌ పనులు పూర్తి చేస్తాం : మంత్రిగతంలో టిడిపి హయాంలో చేపట్టిన పూర్తి గాక పెడింగ్‌లో ఉన్న అన్ని పనులు వెంటనే పూర్తి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి దామచర్ల సత్య తెలిపారు. మండల పరిధిలోని గుర్రపడియ గ్రామంలో టిడిపి నాయకులు మంగళవారం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, మాజీ ఉపసర్పంచి మారెడ్డి సుబ్బారెడ్డి, మారెడ్డి అబ్బిరెడ్డి, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️