మంత్రి స్వామికి సన్మానం

ప్రజాశక్తి- టంగుటూరు : మండల పరిధిలోని ఎం. నిడమనూరు గ్రామ టిడిపి అధ్యక్షుడు కాకుమాని శ్రీకాంత్‌, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామిని నాయుడు పాలెం లో వారి నివాసంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. అనంతరం ఎం. నిడమనూరు గ్రామంలోని డ్రైనేజీ సమస్యల గురించి మంత్రి స్వామి కి వివరించారు. మురుగునీరు ముందుకు వెళ్లేందుకు మార్గం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. ఈ కార్యక్రమంలో ఐటిడిపి మండల అధ్యక్షుడు కాకుమాని శ్రీనివాస్‌, టిడిపి గ్రామ ప్రధాన కార్యదర్శి పేరాబత్తిన రంగారావు, టిడిపి సీనియర్‌ నాయకులు కొత్తపల్లి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️