ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వీసీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వీసీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వీసీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతిప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్‌ అకడమిక్‌ కన్సల్టెట్‌ బి.వెంకటేశ్వర్లు రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వీసీకి వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు అక్బర్‌ మాట్లాడుతూ వెంకటేశ్వర్‌రెడ్డి ఎస్‌ఎఫ్‌ఐని కించపరిచేలా మాట్లాడటమే కాకుండా, విద్యార్థిసంఘాల్లో ఇకపై పాల్గొనవద్దని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఃరాజ్యాంగ విశిష్టత..ప్రస్తుత సవాళ్లుః అంశంపై సదస్సు నిర్వహించడాన్ని జీర్ణించుకోలేకనే ఈ విధమైన ఇబ్బందులకు గురిచేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేలా ఆయన చర్యలు ఉన్నాయన్నారు. వీసీకి వినతిపత్రం ఇచ్చిన వారిలో అశోక్‌, నరేంద్ర, వినోద్‌ పాల్గొన్నారు.

➡️