ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి

Apr 7,2024 22:46
ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి

ప్రజాశక్తి- సోమల : ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన సదుం మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సదుం మండలం చెరుకువారిపల్లికి చెందిన శరవణ, భాను పండ్ల వ్యాపారం చేసుకుంటూ సదుంలో కాపురం ఉన్నారు. ఆయన కుమారులు ఇద్దరు అభినాష్‌ (14) అశ్విన్‌ (13)లు వీరు సదుం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అభినాష్‌ 9వ తరగతి, అశ్విన్‌ 8వ తరగతి చదువుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం సదుం నడిగడ్డ మార్గమధ్యంలోని రఘుపతి నాయనచెరువులో ఈతకు వెళ్లారు. చెరువులో దిగి ఈత రాకపోవడంతో మునిగిపోయి చనిపోయారు. దగ్గర్లో ఉన్న పంట పొలాల్లో పనిచేసుకుంటున్న పలువురు గమనించి వారి మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై మారుతి, సీఐ కష్ణారెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మతదేహాలను సదుం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇద్దరు పిల్లలు చనిపోవడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు..

➡️