పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ

May 2,2024 21:15

ప్రజాశక్తి – సీతంపేట: పాలకొండ నియోజకవ ర్గంలో పోలింగ్‌ విధులు నిర్వహించేందుకు వేరే నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు గురువారం ఐటిడిఎ మీటింగ్‌ హాల్‌, బాలికల గురుకుల పాఠశాలలో పోలింగ్‌ విధులపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. వీరికి మాస్టర్‌ ట్రైనీలు ఇవిఎం యంత్రాల పనితీరు, మాక్‌ పోలింగ్‌ చేయు విధానం, నివేదికలు సమర్పించే వివిధ ఫారాల గురించి శిక్షణ ఇచ్చారు. ప్రిసైడింగ్‌ అధికారులు అడిగినా వివిధ సందేహాలను మాస్టర్‌ ట్రైనీలు నివృత్తి చేశారు. ఈ శిక్షణలో సెక్టార్‌, రూట్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో మాస్టర్‌ ట్రైనీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.వ్యయ రిజిస్టర్ల పరిశీలనఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయానికి సంబంధించిన వ్యయ రిజిస్టర్లను గురువారం అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు రమాకాంత్‌ ప్రధాన్‌ పరిశీలించారు. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో వ్యయ పరిశీలన బృందాలతో రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. వ్యయ రిజిస్టర్లలో అభ్యర్థి ఖర్చుల వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. మళ్లీ మే 6, 11 తేదీల్లో వ్యయ రిజిస్టర్ల పరిశీలన ఉంటుందని, ఆ రోజుల్లో తప్పనిసరిగా పరిశీలన చేయించుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో పార్టీల ప్రతినిధులు, వ్యయ పరిశీలన బృందాలు పాల్గొన్నాయి. రేండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి : ఆర్‌ఒ పాలకొండ : రెండో విడత రేండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యిందని పాలకొండ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శుభం బన్సల్‌ తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూం వద్ద రేండమైజేషన్‌ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. అదే విధంగా త్వరలో కమీషనింగ్‌ ప్రక్రియ చేపడతామన్నారు. పార్లమెంట్‌, అసెంబ్లీకు సంబంధించిన ఇవిఎంలను రేండమైజేషన్‌ చేసి స్ట్రాంగ్‌ రూంలో భద్రపర్చి సీల్‌ వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్లు వరహాలు, ఉమామహేశ్వరరావు, ఇతర ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.సాలూరు : పట్టణంలో ఇవిఎం పార్లమెంటుకు సంబంధించిన రెండో రేండమైజేషన్‌ గురువారం పూర్తి చేశారు. పోటీలో ఉన్న అభ్యర్ధులు, ఏజెంట్లు ఆధ్వర్యంలో ఇవిఎం రెండో విడత రాండమైజేషన్‌ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రిటర్నింగ్‌ అధికారి సి విష్ణు చరణ్‌ అధ్యక్షతన చేశారు. అనంతరం పిఒ, ఎపిఒల శిక్షణా తరగతులను తనిఖీ చేశారు.

➡️