జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

Nov 28,2023 16:10 #Prakasam District

ప్రజాశక్తి-మార్కాపురం(ప్రకాశం) :సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేసి,వెనుక బడిన వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బాల మురళీ కృష్ణ, పట్టణ వైసిపి అధ్యక్షులు, వైస్‌ చైర్మన్‌ ఇస్మాయిల్‌, వైస్‌ చైర్మన్‌ 2 అంజమ్మ శ్రీనివాసులు ,ఎంపీపీ అరుణ చెంచిరెడ్డి,పట్టణంలోని కౌన్సిలర్‌ లు,వార్డ్‌ ఇంఛార్జ్‌ లు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..

➡️