జ్యోతిరావు పూలేకి నివాళి

Apr 11,2024 21:28

ప్రజాశక్తి-విజయనగరం : మహాత్మా జ్యోతిరావు ఫూలేకి జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఫూలే 198వ జయంతి గురువారం ఘనంగా జరిగింది. ఫూలే చిత్రపటానికి కలెక్టర్‌ నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు జాతికి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, డిఆర్‌డిఎ పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, డిబిసిడబ్ల్యూఒ సందీప్‌కుమార్‌, వసతి గృహ సంక్షేమాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️