హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్

May 7,2024 16:20 #tirupathi

ప్రజాశక్తి-వి కోట : మండల కేంద్రమైన వీకోటలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో హజ్ యాత్రికులకు మంగళవారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్య అధికారి డాక్టర్ మురళి తెలిపారు. వి కోట ,కుప్పం ,పలమనేరు, పెద్దపంజాణి మండలాలకు చెందిన 57 మంది హజ్ యాత్రకు వెళ్తున్న వారికి రైతు సిబ్బంది వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ టీకాల కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రవి రాజు,హజ్ కమిటీ ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్ ఘనీ తస్లిం పర్యవేక్షించారు. జిల్లా స్టాటిస్టి కల్ మరియు హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి గుణశేఖర్ వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు వారి పనితీరును తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. శిబిరానికి హాజరైన వారికి హజ్ కమిటీ సభ్యులు భోజనం ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఓగు పి హెచ్ సి వైద్యాధికారి రాజేష్ , సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు ,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️