ఎసిబి వలలో ట్రాన్స్‌కో ఎఇ- రైతు వద్ద లంచం తీసుకుంటూ పట్టబడిన వైనం

ప్రజాశక్తి-మదనపల్లె రైతు వద్ద రూ.35 వేలు లంచం తీసుకుంటూ ట్రాన్స్‌కో ఎఇ పట్టుబడ్డారు. వివరాలు.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియో జకవర్గం కురబలకోట మండ లం చింతపల్లెకు చెం దిన రైతు మధుకర్‌ తన తండ్రి రాజారెడ్డి, చిన్నాన్న రఘు నాథరెడ్డి పేర్లతో ట్రాన్స్‌ఫా ర్మర్ల కోసం గత న వంబర్‌లో విద్యుత్‌ ఎఇ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిఒక్కో సర్వీసుకు రూ. 23,300 చొప్పున రూ. 46,600 చలానా డిసెంబర్‌లో తీశారు. దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాకపోవడంతో ఇటీవల రైతు మధుకర్‌రెడ్డి ట్రాన్స్‌కో ఎఇ వెంకటరత్నంను సంప్రదించారు. అందుకు ఆయన రూ.35 వేలు ఇస్తే మంజూరు చేస్తానని చెప్పడంతో రైతు ఎసిబిని సంప్రదించారు. మంగళవారం ఎఇ వెంకటరత్నం మధుకర్‌నుంచి రూ. 35 వేలు తీసుకుంటూ ఉండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ. 23,300 చొప్పున రూ. 46,600 చలానా డిసెంబర్‌లో తీశారు. దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాకపోవడంతో ఇటీవల రైతు మధుకర్‌రెడ్డి ట్రాన్స్‌కో ఎఇ వెంకటరత్నంను సంప్రదించారు. అందుకు ఆయన రూ.35 వేలు ఇస్తే మంజూరు చేస్తానని చెప్పడంతో రైతు ఎసిబిని సంప్రదించారు. మంగళవారం ఎఇ వెంకటరత్నం మధుకర్‌నుంచి రూ. 35 వేలు తీసుకుంటూ ఉండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

➡️