ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

Jan 23,2024 18:02

ప్రజాశక్తి-తెర్లాం : ఇటీవల విజయవాడలో జరిగిన బుక్‌ ఎక్సిబిషన్‌లో పెరుమాళి ఆదర్శ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఆటోమోటివ్‌ టెక్నాలజీ కోర్సులో ఉపాధ్యాయులు టి.లక్ష్మణ్‌ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించి, వారితో అగ్రికల్చర్‌ రోబోట్‌ను తయారు చేయించారు. వ్యవసాయ సాగులో ఈ రోబోట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులు కార్తిక్‌, లలిత్‌ ఆదిత్య, భరత్‌, దేవిశ్రీప్రసాద్‌, ఆసీస్‌, ఆనంద్‌తోపాటు గైడ్‌ టీచర్‌ లక్ష్మణ్‌ను ప్రిన్సిపల్‌ జ్యోతిలక్ష్మి అభినందించారు.

➡️