ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

Mar 3,2024 20:55

ప్రజాశక్తి-విజయనగరం కోట : మంచి ప్రవర్తనతో కూడిన నాయకులను ఎన్నుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌ గజపతిరాజు ప్రజలను కోరారు. ఆదివారం స్థానిక అశోక్‌ బంగ్లాలో ఆయన హయాంలో చేసిన అభివద్ధి పనుల వీడియో సీడీని మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పి.సునీల గజపతి రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ ఏదైనా మంచి పనులు, విజయాలు సాధించామంటే.. అది ప్రజలు విజయమన్నారు. సంక్షేమ పథకాల తొలగింపులో జగన్‌ ప్రభుత్వం ముందుందన్నారు. అరాచపాలన తప్ప అభివద్ధి లేదన్నారు. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అదితి గజపతిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, మండల అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, రాష్ట్ర బిసి నాయకులు వేచలపు శ్రీనివాసరావు, అవనాపు విజరు, పిల్లా విజరుకుమార్‌, గాడు అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

➡️