యుటిఎఫ్‌ ఆధ్వర్యాన కొవ్వొత్తులతో ర్యాలీ

Jan 24,2024 21:27

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పిఆర్‌సి, డిఎ, ఎస్‌ఎల్‌, పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని యుటిఎఫ్‌ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం కలెక్టరేట్‌ వద్దనున్న ఎన్‌టిఆర్‌ విగ్రహం నుంచి జ్యోతిరావుపూలే విగ్రహం వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్‌కె ఈశ్వరరావు మాట్లాడుతూ ఆర్థిక బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందులో భాగంగా ఈ నెల ఈ నెల 31, ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో రిలే దీక్షలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కె.శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శులు కె.ప్రసాదరావు, సిహెచ్‌ తిరుపతి నాయుడు, జి.రాజారావు, ఎన్‌.సత్యనారాయణ, అల్లు శంకర్రావు, సిపిఎస్‌ జిల్లా కన్వీనర్‌ పి.రాంప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️