రానున్నది టిడిపి-జనసేన ప్రభుత్వమే : నాగార్జున

Jan 22,2024 21:30

గుర్ల : వచ్చే అసంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి టిడిపి- జనసేన ప్రభుత్వం స్థాపించడం తధ్యమని టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కిమిడి నాగార్జున అన్నారు. ఆదివారం రాత్రి మండలంలో తాతావారి కిట్టలి గ్రామం నుంచి పలు కుటుంబాలు వైసిపిని వీడి నాగార్జున సమక్షంలో టిడిపిలో చేరాయి. వీరందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. టిడిపి మండల అధ్యక్షులు చనమల్ల మహేశ్వరరావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయమే లక్ష్యంగా పని చేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో వార్డు మెంబర్లు రాగోలు గౌరి నాయుడు, ఇజ్జురోతు రమణ, పాండ్రంకి సూర్యకాంతం, గడి సూరినాయుడు, మామిడి మాలచ్చమ్మ, రెడ్డి లక్ష్మనాయుడు, మామిడి సాంబ, రాగోలు సీతంనాయుడు, రాగోలు లక్ష్మనాయుడు, రాగోలు అప్పలనాయుడు, రాగోలు సత్యం, పాండ్రంకి లక్ష్మ నాయుడు, గడి రామ్మూర్తి, ఇజ్జురోతు సత్తిరాము, గేదెల గౌరి నాయుడు తదితర 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వెన్నె సన్యాసినాయుడు, తిరుమలరాజు కిరణ్‌ కుమార్‌రాజు, చనమల మహేశ్వర రావు, మామిడి సూర్యారావు, పిళ్ళా అప్పలనాయుడు, సంచాన సన్యాసి నాయుడు, కర్రోతు గోవింద, గొర్లె రామునాయుడు, మండల అప్పల నాయుడు, శ్రీను, సూర్యారావు, నారాయణరావు, పైడినాయుడు, దాసరి శివ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.అంగన్వాడీలకు అన్యాయం చీపురుపల్లి :. హక్కుల కోసం రోడ్డెక్కిన అంగన్వాడీలకు కనీసం న్యాయం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేయడం లేదని విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. జగన్మోహన్‌ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల తొమ్మిది నెలల కాలంలో అనేక రకాలుగా విఫలమయ్యారని విమర్శించారు. సోమవారం చీపురుపల్లిలో ఆయన తన నివాసంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. జగన్‌పాలనా సమయంలో ఒక ముఖ్యమంత్రిగా ఉపాధి అవకాశాలు గానీ, అభివృద్ధి గానీ చేశారా అని ప్రశ్నించారు సంక్షేమ పథకాలంటూ వంద రూపాయలు మన చేతికి ఇచ్చి, తిరిగి 200 రూపాయల లాక్కుంటున్నారని ఆరోపించారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలు, రంజాన్‌ తోఫా ఇచ్చేవారని.. నేడు అవన్నీ ఏమయ్యాయని అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌.. ఈరోజు నిషేధం కాదు కదా, మద్యం ధరలను మూడు, నాలుగింతలు పెంచారని తెలిపారు. దీనికి తోడు నకిలీ మద్యం ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ఏడు సార్లు విద్యుత్తు బిల్లులు పెంచారని తెలిపారు. జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టు మిగులు పనులు పూర్తి చేయలేదని, నిర్వహణ కోసం ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. చివరికి ఉద్యోగులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చరిత్రలో జీతాలు తగ్గించిన ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్‌ ఒక్కరే అని విమర్శించారుచంద్రబాబు అధికారంలోకి రాగానే ఎస్‌సి, ఎస్‌టి, బిసిల రక్షణ చట్టాలతో పాటు సబ్‌ ప్లాన్‌ నిధులు న్యాయంగా ఖర్చు చేస్తారని తెలిపారు.

➡️