రెండు షాపులు దగ్ధం రోడ్డున పడ్డ చిరు వ్యాపారులు

Apr 1,2024 21:26

మెరక ముడిదాం : మండలంలోని బైరిపురం బస్టాండ్‌ ఆవరణలోని కొత్త వీధిలో ఆదివారం అర్ధ రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు షాపులు దగ్ధమయ్యాయి. ఒక్కసారి అగ్ని కీలలు ఎగిసి పడటంతో చుట్టు పక్కల ఉన్న వాళ్ళు భయబ్రాంతులకు గురయ్యారు. ఉవ్వేత్తిన మంటలు దట్టమైన పొగలు వ్యాప్తించటంతో ఎమైందో తెలియక భయంతో పరుగులు తీశారు. స్థానికల వివరాలు ప్రకారం.. బైరిపురం బస్టాండ్‌ ఆవరణలో ఉన్న ముత్యాల అచ్చిరాజు, సబ్బిశెట్టి లక్ష్మణలకు సంబంధించిన పాన్‌ షాపులు వెనుక భాగము నుండి ఆదివారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో దట్టమైన పొగలతో కూడిన అగ్ని మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ విషయాన్ని షాపుల యజమానులకు తెలియజేయడంతో వారు వచ్చేసరికే మంటలు పూర్తిగా వ్యాపించాయి. దీంతో మంటలను అదుపు చేయలేకపోయారు. విషయం తెలుసుకున్న బైరిపురం ఉపసర్పంచ్‌ పప్పల కృష్ణమూర్తి, కందుల మల్లి కార్జునరావు, కందుల శ్రీనివాసరావు వెంటనే చీపురుపల్లి అగ్ని మాపక సిబ్బందికి తెలియ చేయగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే పూర్తిగా షాపులు, వాటిలో ఉన్న సామాగ్రి కాళిపోయాయి. షాప్‌ యజమానులు గత 30 ఏళ్లుగా వాటి మీదే ఆధారపడి వారి కుటుంబాలను పోసిస్తున్నారు. ఇంతలో ఇలా జరగడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. సుమారు రూ.15లక్షలు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. మంటలకు కారణం షాట్‌ సర్క్యూట్‌ లేదా ఎవరైనా చేసి వుంటారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

➡️