విజేతలకు బహుమతులు ప్రదానం

Jan 14,2024 19:57

ప్రజాశక్తి-విజయనగరం కోట : వాజీ చానల్‌ ఆధ్వర్యాన నిర్వహించిన రంగోలీ, మెగా హౌసీ లక్కీ డ్రా విజేతలకు ఆదివారం స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియంలో బహుమతులు ప్రదానం చేశారు. వాజీ చానల్‌ ఎమ్‌డి గణపతినీడి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి విజేతలకు బహుమతులు అందించారు. మహిళలలో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయడమే కాక, సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించేలా కృషి చేస్తున్న శ్రీనివాసరావును డిప్యూటీ మేయర్‌ ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి గుండమ్మ కథ సీరియల్‌ ఫేమ్‌ పూజ మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నర్తనశాల, అమృత శ్రీ వర్షిణి స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ అండ్‌ మ్యూజిక్‌ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జి, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కె.ఎ.నాయుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి తదితరులు పాల్గొన్నారు.

➡️