రామభద్రపురంలో వైసీపీకు షాక్

Dec 22,2023 12:57 #Vizianagaram
200 families join in tdp from ycp

వైసీపీను వీడిన వైసీపీ సర్పంచ్, మరో 200 కుటుంబాలు

ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రపురం మండలంలోని అధికార వైసీపీకు భారీ షాక్ తగిలింది. సోంపురం పంచాయతీ వైసీపీ సర్పంచ్ చొక్కాపు చినఅప్పలనాయుడు శుక్రవారం బొబ్బిలి కోటలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి బేబినాయన సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోంపురం, మర్రివలస, చింతలవలస గ్రామాలకు చెందిన మరో 200 కుటుంబాలు వైసీపీను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా బేబినాయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనకు విసుగు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. వైసీపీ పాలనలో గ్రామాలు అధోగతి పాలయ్యాయని విమర్శించారు. టీడీపీ, జనసేన ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ రామభద్రపురం మండల అద్యక్షులు కరణం భాస్కరరావు, సీనియర్ నాయకులు ఎం.తిరుపతిరావు, టీడీపీ పట్టణ అద్యక్షులు రాంబార్కి శరత్, తదితరులు పాల్గొన్నారు.

➡️