మోసపూరిత మేనిఫెస్టో నమ్మి మోసపోవద్దు

May 4,2024 21:44

పాచిపెంట : చంద్రబాబు నాయుడు ప్రకటించిన మోసపూరిత మేనిఫెస్టో నమ్మి ప్రజలు మోసపోవద్దని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర కోరారు. రాష్ట్ర ప్రజలను మరో మారు మోసగించడానికి చంద్రబాబు చూస్తున్నారన్నారు. మండలంలోని పనుకువలస, పి.కోనవలస, మంచాడవలస, విశ్వనాధపురం, కర్రివలస పంచాయతీల్లో గల పలు గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాయగాళ్లు, మోసగాళ్లు మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. మళ్లీ మీరంతా ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి టిడిపి నాయకులకు బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి బి.ప్రమీల, డోల బాబ్జీ, గొట్టాపు ముత్యాలునాయుడు, టి.గౌరీశ్వరరావు, సిహెచ్‌ సీతారామకృష్ణ, సిహెచ్‌ సావిత్రి, పలువురు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సాలూరు: రానున్న ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి, డిప్యూటీ సీఎం రాజన్నదొరను మరోసారి గెలిపించాలని కోరుతూ విశ్రాంత డిఇ ఎంవిఎన్‌ వెంకటరావు శనివారం ప్రచారం చేశారు. పంచాయితీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ లో డిఇ గా నియోజకవర్గం లో ఎక్కువ కాలం పని చేసిన వెంకటరావుకు రాజన్నదొర అంటే వ్యక్తిగత అభిమానం వుండడంతో ఆయన గెలుపు కోసం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శనివారం తోణాం సంతలో వైసిపి నాయకులు, సర్పంచ్‌ మువ్వల ఆదియ్య, సీనియర్‌ నాయకులు దండి శ్రీనివాసరావు,ఎస్టీ సెల్‌ జిల్లా కన్వీనర్‌ కొండ గొర్రి ఉదరు కుమార్‌తో కలిసి ప్రచారం చేశారు. మళ్లీ రాజన్నదొర గెలిస్తే నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతారని చెప్పారు. కార్యక్రమంలో జానపద గాయకుడు డప్పు శ్రీను రాజన్నదొర పై పాటలు పాడి అలరించారు.

➡️