పోలియో అవగాహన ర్యాలీ 

Mar 1,2024 12:22 #Vizianagaram
Polio awareness rally

నిండు జీవితానికి రెండు చుక్కలు

ప్రజాశక్తి-విజయనగరం కోట : పోలియో అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్.భాస్కరరావు. శుక్రవారం నాడు స్థానిక డి ఎం ఎం హెచ్ ఓ కార్యాలయం నందు పోలియో అవగాహన రాలేని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల మూడవ తేదీన పోలియో ఆదివారం దేశవ్యాప్తంగా పాటించడం జరుగుతుంది ఆరోజు 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని పిల్లల తల్లిదండ్రులను కోరారు. అదేవిధంగా ఎవరైనా ఆరోజు పోలియో చుక్కలు వేయించి లేకపోతే అదనంగా 4,5 తేదీల్లో పిల్లలకు వ్యాధించవచ్చని తెలిపారు. దేశాన్ని పోలియో రహిత దేశంగా చేయడమే లక్ష్మన్నారు చిట్టచివరి కేసు 2011లో నమోదయిందన్నారు ఈ పోలియో మన దేశంలో అయితే లేదు కానీ మన పక్క దేశాల్లో ఉన్న పాకిస్తాన్ , ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ఉంది ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి కాబట్టి రెండు చుక్కలు వేయిస్తే నిండు జీవితాన్ని పిల్లలకి ఇవ్వొచ్చని తెలిపారు. ప్రధానంగా ఐ రిస్క్ ప్రాంతాల్లోనూ, స్లమ్ ఏరియా, సంచార్జాతులు ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 0 నుంచి 5 సంవత్సరాలలో పిల్లలు 1,98, 478 మంది ఉన్నారన్నారు జిల్లావ్యాప్తంగా 1182 బూతులు, 200450 బృందాల సంఖ్య, 192 సూపర్వైజర్లు, 66 మొబైల్ టీమ్స్, 20 ట్రాన్సిట్ టీములు, 56 కోల్డ్ చైన్ పాయింట్లు పెట్టి పోలియో చుక్కలు అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే .రాణి, డి ఐ ఓ డాక్టర్ అచ్యుతకుమారి, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ ఎన్. సూర్యనారాయణ, డెమో సిబ్బంది పాల్గొన్నారు.

➡️