27న రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు

May 24,2024 21:18

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఈ నెల 27న విద్యారంగంలో పరిణామాలు- సవాళ్లు అనే అంశంపై రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్లు యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్‌చంద్ర పట్నాయక్‌, జెఎవిఆర్‌కె ఈశ్వరరావు తెలిపారు. శుక్రవారం నగరంలోని కెఎల్‌పురంలో శేషగిరి విజ్ఞాన కేంద్రం వద్ద సదస్సు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సోమవారం ఉదయం 9.30 గంటలకు శేెషగిరి విజ్ఞాన కేంద్రం సెల్లార్‌లో విద్యారంగంలో పరిణామాలు – సవాళ్లు, కర్తవ్యాలు అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శాసనమండలి మాజీ ప్రొటెంస్పీకర్‌ విఠపు బాలసుబ్రమణ్యం, యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ప్రసంగిస్తారని తెలిపారు. రాష్ట్ర స్థాయి సదస్సుకు రాష్ట్ర కార్యదర్శులు, ఉత్తరాంధ్ర జిల్లాల నాయకత్వం హాజరవుతారని చెప్పారు. ఉపాధ్యాయులు అందరూ హాజరై, విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు డి.రాము, జిల్లా కార్యదర్శులు కె.ప్రసాదరావు, పి.వాసుదేవరావు, సిహెచ్‌ తిరుపతినాయుడు, జి.రాజారావు, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ఎ.శంకరరావు, సిపిఎస్‌ సబ్‌ కమిటీ కన్వీనర్‌ పి.రాంప్రసాద్‌ నగర ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటరావు పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి
ఈ నెల 27న జరిగే యుటిఎఫ్‌ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని యుటిఎఫ్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణ, రామకృష్ణ, కె.శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయంలో సదస్సు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. 27న ఉదయం 9.30 గంటలకు శేషగిరి తృతీయ వర్థంతి సందర్భంగా శేషగిరి విజ్ఞాన కేంద్రం సెల్లార్‌లో సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

➡️