రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ లో విజయనగరం విజయకేతనం

Feb 28,2024 12:56 #Vizianagaram

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఈ నెల 25న విశాఖ నగరoలో జరిగిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్న విజయనగరం యువకులు విజయకేతనం ఎగుర వేసి విజయనగర వారసత్వాన్ని, కొడిరామ్మూర్తి స్పూర్తిని నిలబెట్టారని విజయనగరం జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి శంకర్రావు, కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావులు అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విశాఖ భవాని గార్డెన్స్ ,పాత ఐటిఐ జంక్షన్ వద్ద నవ్యాంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో 80 కేజీల విభాగంలో దారపు సన్నిబాబు 5వ స్థానం డి.రమణ 4వ స్థానం , 55 కేజీ ల విభాగంలో అల్లు రాజేష్ విజేతలుగా నిలిచారు. వీరిని రెడ్డి శంకర్రావు, కె. శ్రీనివాసరావులు అభినందించారు.

➡️