పే స్కేల్ జీతాలకై విఆర్ఎల ధర్నా

Dec 21,2023 11:55 #Vizianagaram
vra protest at vzm

డిఏ బకాయిల చెల్లింపుతో పాటు బిఎల్ డ్యూటీలు మినహా యింపు వంటి సమస్యలు పరిష్కారించాలి
విఅర్ఏల సంఘం డిమాండ్
ఎమ్మర్వో కార్యాలయం ఎదుట ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విఆర్ఎలకు పే స్కేల్ అమలు చేయాలని, డిఎ బకాయిలు చెల్లించాలని,బి ఎల్ ఓ విధులు నుంచి మినాహింపు ఇవ్వాలని కోరుతూ ఎపి గ్రామ రెవెన్యూ సహకులు సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ధర్నాను ఉద్దేశించి వి అర్ ఎ ల సంఘం జిల్లా అధ్యక్షుడు గురుమూర్తి, సిఐటియు నాయకులు బి.రమణలు మాట్లాడుతూ వీఆర్ఎలకు సంబంధం లేని పనులు వారతోచేయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తుందన్నారు. అదే విధంగ కేవలం 10,500 రూపాయలతో పెరుగుతున్న నిత్యావసర సరుకులు పెట్రోలు డీజిలు గ్యాస్ వంటివాటి ధరలు పెరుగుదలతో విఆర్ఎలు బతకలేక పస్తులతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పోరాడి సాధించుకున్న డిఎను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారీ వేలాది రూపాయలు తిరిగి రికవరీ చేసినటువంటి నిరంకుశ చర్యల్ని ఖండిస్తున్నామన్నరు. వీఆర్ఎల శ్రమకు తగిన వేతనం చెల్లించడం లేదు. పైగా నామినీలనుపర్మినెంట్ చేయకుండా కాలయాపన చేస్తోంది పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఎలకు పేస్ స్కేల్ అమలు చేస్తుంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తూ వీఆర్ఎలకు ద్రోహం చేస్తుందన్నారు. ఇటువంటి ద్రోహం చేసే పద్ధతులను వెంటనే విడనాడి వీఆర్ఎల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మీద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
రాష్ట్రంలోని 24 వేలమంది వీఆర్ఎలకు తెలంగాణలో అమలవుతున్న విధంగా పే స్కేల్ అమలు చేయాలని, 2018 జూన్ నుండి రికవరీ చేసిన డిఎ వాటా నిధుల చెల్లింపు, బిఎల్ డ్యూటీల నుండి వీఆర్ లను మినహాయించాలని తదితర సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ధర్నాలో
విఆర్ఎలకు వేతనం ₹26,000 ఇవ్వాలని, తెలంగాణ తరహాలో విఆర్ఎ లకు పేస్కేలు అమలు చేయాలని, నామినీలు గా పనిచేస్తున్న విఆర్ఎ ల ను రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన డి.ఏ.ను వేతనంతో కలిపి ఇవ్వాలి.రికవరీ చేసిన డి.ఏ ను విఆర్ఎ ల అకౌంట్ కు జమచేయాలని నినదించారు. చనిపోయిన విఆర్ఎ లకు బకాయి గ్రాడ్యూటి చెల్లించాలని, రీసర్వే లో పాల్గొన్న విఆర్ఎ లకు టి.ఎ & డి.ఎ లు ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో విఅర్ఎలు రామ్  గోపాల్, కే.ప్రసాద్, సన్యసిప్పడు, వీరాస్వామి, సూర్యనారాయణ వి అర్ ఏ లు పాల్గొన్నారు.

➡️