ఎన్డీఏ కూటమి ఎంపి అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలి

Apr 6,2024 15:17 #Visakha

జిఎస్టి అధికారులపై దౌర్జన్యంపై  సిపిఐ

ప్రజాశక్తి-చోడవరం : చోడవరం నడిబొడ్డున బుచ్చిబాబు అండ్ టైల్స్ కంపెనీ వారు జీఎస్టీ పనులను ఎగవేసి అక్రమ వ్యాపారం చేసుకుంటూ కోట్లు పడగెత్తి అధికార పార్టీ రాజకీయ నాయకులను వాడుకుంటూ వ్యాపారం సాగించుకుంటున్నారు. జిఎస్టి అధికారులు సామరస్యంగా తనిఖీలు చేప్పటగా… ఎన్డీఏ కూటమి ఎంపి సీఎం రమేష్, కూటమి అభ్యర్డులు దౌర్జన్యంగా అధికారుల్ని వారి యొక్క విధులకు ఆటంకం కలిగించి, వారిపై దౌర్జన్యం చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పైన టైల్స్ వ్యాపారిపై పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేస్తున్నారు. జీఎస్టీ అధికారులు బుచ్చిబాబు టైల్స్ అండ్ కంపెనీపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి పన్ను ఎగవేసిన దానికి అధిక మొత్తంలో వసూలు చేయవలసిన అవసరం అధికారులపై ఉందన్నారు. వెంటనే ఆ పద్ధతిలో చర్యలు చేపట్టాలని అన్నారు. అదే పద్ధతిలో ఎన్డీఏ పరిపాలన విధానం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ అదాని, అంబానీ వారికి ఎన్ డి ఏ ప్రభుత్వం పూర్తిగా దేశాన్ని అప్పజెప్పాలని ఆలోచనలో ఉందన్నారు. కావున ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని ఓడించి దేశాన్ని కాపాడాలని అవసరం ఎంతైనా ఉందని, చిన్న వ్యాపారం చేసుకున్న వారి పొట్టకొట్టి, అక్రమ వ్యాపారం చేసుకుంటున్న వారికి కొమ్ముకాస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి రానున్న కాలంలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే భారతదేశానికి ముప్పు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుందని, జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారస్తులకు కొమ్ముకాస్తున్నట్లు  తేటతెలమవుతోందన్నారు. ఎన్ డి ఏ కూటమి అభ్యర్థుల్ని ఓడించి భారతదేశాన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా అన్నారు.

➡️