హైవే దిగ్బంధం 

Dec 22,2023 15:29 #Visakha
vskp anganwadi workers strike on 11th day

రాస్తా రోకో..
అంగన్వాడీలను చుట్టుముట్టిన పోలీసులు
రోప్ తో కట్టడి చేసే క్రమంలో అంగన్వాడీలకు, మహిళా పోలీసులకు మధ్య తోపులాట
బూటుతో తన్నిన మహిళా పోలీసు తీరుపై  అంగన్వాడీల ఆగ్రహం
సిఐటియు నాయకులు మూర్తి, పలువురు అంగన్వాడీల బలవంతపు అరెస్టులు
ప్రజాశక్తి-తగరపువలస : న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం స్థానిక 16వ నెంబరు జాతీయ రహదారిపై భీమిలి అర్బన్, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేసి, గంటకు పైగా దిగ్బంధం చేశారు.
హైవే వద్దకు వెళ్లొద్దని పద్మనాభం మండల సిఐ సిఐటియు నాయకులు ఆర్ ఎస్ ఎన్ మూర్తిని సర్ది చెప్పడంతో పాటు ఓ సందర్భంలో హెచ్చరించిన ప్పటికీ, శాంతియుతంగానే ఆందోళన చేస్తున్నట్లు మూర్తి బదులిచ్చారు.

  • నీడలా పోలీసులు…

స్థానిక సి ఐ టి యు కార్యాలయం వద్ద ప్రారంభమైన అంగన్వాడీల ర్యాలీని తొలుత అడ్డుకునేందుకు మహిళా పోలీసులు చేసిన ప్రయత్నాన్ని ఆది లోనే అడ్డుకున్నారు. ర్యాలీకి ముందు మహిళా పోలీసులు వలయాకారంలో ఉంటూ వేంకటేశ్వర మెట్ట, హైవే వరకు నీడలా పోలీసులు వెళ్లారు

  • తోపులాట…. అరెస్టులు….

హై వే వద్ద రాస్తారోకో చేశారు. సిఐ టి యు నాయకులు ఆర్ ఎస్ ఎన్ మూర్తి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యమ నేపథ్యాన్ని, సిఎంకు తెలియకుంటే, గతంలో సిఎంగా పని చేసిన చంద్రబాబు నాయుడును అడిగితే తెలుస్తుందని స్పష్టం చేశారు. మూర్తి మాట్లాడుతుండగా, పోలీసులు ఉన్న పళంగా అరెస్ట్ చేసి జీపులోకి ఎక్కించారు. పోలీసు జీపు ముందుకు కదలనీయ కుండా అంగన్వాడీలు రోడ్డుపైనే బై ఠాయించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ లకు, మహిళా పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఒకానొక దశలో ఏం జరుగుతుందో తెలియని పరిస్తితి. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన పోలీసులు రో ప్ సాయంతో హైవే పైకి వెళ్లకుండా కట్టడి చేశారు. అయినా సరే రోప్ కింద కు వెళ్లి, చేదించుకుని మళ్ళీ హై వే ఎక్కారు. వారిని కట్టడి చేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాన్ని పలు మార్లు అంగన్వాడీ లు అడ్డుకున్నారు. ఒక సందర్భంలో తీవ్రంగా ప్రతిఘటించారు. ఓ మహిళా పోలీస్ బూటు తో తన్నడం తో అంగన్వాడీ లు ఆమె తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం జేశారు. పోలీసులకు, అంగన్వాడీ లకు మధ్య పెనుగులాటలో ఎ పి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హె ల్ప ర్స్ యూనియన్ (సి ఐ టి యు) గౌరవాద్యక్షులు కె వెంకట లక్ష్మి నోటి వద్ద గాయమై, రక్త స్రావం అయింది. ఆమెతో పాటు మరికొందరిని జీపులో అరెస్ట్ చేసి భీమిలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నార్త్ సబ్ డివిజన్ ఎ సి పి శివ శంకర రెడ్డి ఆధ్వర్యంలో పద్మనాభం సిఐ, భీమిలి ఎస్సై, ఎ ఎస్సై, సిబ్బంది మహిళా పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

➡️