పేదల ఇళ్లలోకి నీరు

తాడేపల్లి: శుక్రవారం కురిసిన చిన్నపాటి వర్షానికే తాడేపల్లి పట్టణంలోని సీతానగరం బోటుయార్డు వద్ద పేదల ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది. పాలకవర్గాల నిర్ల క్ష్యానికి సజీవ సాక్ష్యంగా ఈ ఫొటోలు నిలుస్తాయి. పదేళ్ల కిందట టిడిపి ప్రభుత్వ హయాంలో కృష్ణా పుష్కరాల సందర్భంగా సీతానగరం రోడ్ల వెంబడి ఉన్న పేదల ఇళ్లను తొలగించారు. సిపిఎం ఇతర రాజకీయ పార్టీల ఆందోళనల కారణంగా ప్రస్తుతం బోటుయార్డు వద్ద నీట మునిగిన స్థలాలను ఒక్కొక్కరికి 40 గజాల చొప్పున కేటాయించారు. పక్కా స్థలాలు 72 గజాలు చొప్పున ఒక్కొక్కరికి ఇస్తామని అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి హామీ నిచ్చింది.

 

ఐదు సంవత్సరాల కాలంలో ఆ పార్టీ పేదలకు ఇస్తానన్న ఇంటి స్థలం ఇవ్వలేకపోయింది. ఆ తరువాత వైసిపి ప్రభుత్వం వచ్చినా పేదల ఇళ్ల స్థలాల సమస్య వెక్కి రిస్తుంది. ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారడంలేదని పేదలు వాపోతున్నారు. పేదల కోసం పని చేస్తామని చెప్పుకునే పాలకపార్టీలు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బోటు యార్డు దగ్గర ఉన్న పేదల ఇళ్లస్థలాల సమస్యను పరిష్కరించాలని అనేక సార్లు బాధితులతో కలిసి సిపిఎం అధికారులకు, ప్రజాప్రతినిధులకు అర్జీలు అంద జేసింది. అయినా వారిలో చలనం లేదు. పేదల కోసం పని చేసే వామపక్ష అభ్యర్థులను ఓటు అనే ఆయుధం ద్వారా గెలిపించు కోవాలని స్థానిక సిపిఎం శాఖ కార్యదర్శి కె.మేరి కోరారు.

➡️