విశ్వబ్రాహ్మణులకు అండగా ఉంటాం

ప్రజాశక్తి-దర్శి : వైసిపి విశ్వబ్రాహ్మణులకు అండగా ఉంటుందని వైసిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. పొదిలి రోడ్డులోని శ్రీవెంకటేశ్వర కల్యాణ మండపంలో విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం వైసిపి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. చేయూత పథకం ద్వారా ఆదుకున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్‌ చైర్పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. అనంతరం బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాదరెడ్డి, బూచేపల్లి నందినిని ఘనంగా సత్కరించారు. అనంతరం మేనిఫెస్టో విడుదలపై విలేకరుల సమావేశంలో శివప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్సర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, వైస్‌ ఎంపిపిలు సోము దుర్గారెడ్డి, కొరివి ముసలయ్య, ఎఎంసి చైర్మన్‌ బుజ్జి, సద్ది పుల్లారెడ్డి, ఎర్రగుండ్ల వెంకయ్య, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.నవర్నతాలు పథకంలో పేదల అభివృద్ధి దొనకొండ : వైసిపి ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాలు పథకంతో పేదలందరూ అభివృద్ధి చెందారని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయని వైసిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సంగాపురం, వీరేపల్లి, మంగినపూడి గ్రామాలలో మన ఊరికి-మన శివన్న కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉషా, మురళి, వైసిపి మండల మాజీ అధ్యక్షుడు కాకర్ల కష్ణారెడ్డి, మాజీ జడ్‌పిటిసిలు శ్రీకాంత్‌రెడ్డి, యాకోబు, నాయకులు ఆంజనేయరెడ్డి, వి.చెన్నయ్య పాల్గొన్నారు.

➡️