తాగునీటి చెరువులన్నింటినీ నింపుతాం

వినుకొండ: పట్టణానికి తాగునీరు సరఫరా చేసే సింగర చెరువును ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శనివారం సందర్శించారు. ఈనెల 8వ తేదీన సాగర్‌ కాల్వ నుండి నీటిని విడుదల చేయడంతో పెరుమళ్ళపల్లి మేజర్‌ కాలవ నుండి మునిసిపల్‌ అధికారులు సింగర చెరు వుకు నీరు నింపుతున్నారు. దీనిలో భాగంగా చెరువుకు నీరు నింపే ప్రక్రియను ఎమ్మెల్యే పరిశీలించారు. వినుకొండ చెరువుకు పూర్తి స్థాయిలో తాగునీటిని పంపేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రతి పక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, గతంలో తాగునీటి ని చేపల చెరువులకు మళ్లించుకొని ప్రజలను ఇబ్బం దులకు గురిచేసింది వారు కాదా? అని ప్రశ్నించారు. అలాంటి పనులు చేసిన వారు ఇప్పుడు నీతివాక్యాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా సింగర చెరువుకు నీటిని సరఫరా చేస్తుంటే అనేక రకాలుగా అడ్డుపడుతున్నారని, ఎన్ని అడ్డంకులు పెట్టినా ఈ చెరువును పూర్తి స్థాయి నీటి సామర్ధ్యంతో నింపుకోగలు గుతున్నామని తెలిపారు. సింగర చెరువుతో పాటు అన్ని మంచినీటి చెరువులను నింపేలా చర్యలు తీసుకుంటా మని తెలిపారు.

➡️