మాచర్ల పట్టణ ప్రజల దాహార్తి తీరుస్తాం

Jun 26,2024 22:58

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి
ప్రజాశక్తి-మాచర్ల :
నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో తాగేందుకు నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి నుంచి ప్రజలను గట్టెక్కించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. పట్టణంలోని అన్న క్యాంటీన్‌ పునరుద్ధరణ ఏర్పాట్లను ఆయన బుధవారం పరిశీలించి మాట్లాడారు. అన్ని గ్రామాలకు తాగునీటి కుళాయిలను ఏడాదిన్నరలో ఏర్పాటు చేస్తామన్నారు. వరికిపూడిశెల, జెర్రీ వాగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను ప్రారంభించి త్వరితగతిన సాగు, తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసేయగా ఇప్పటి వరకూ పట్టణానికి చెందిన ఆర్య వైశ్యులు క్యాంటీన్‌ నడపడా నికి ముందుకు రావడం హర్షణీయమ న్నారు. వైసిపి నాయకులు ఇంకా బుద్ధి మార్చుకోలేదని, టిడిపి శ్రేణులపై ఈగ వాలిన సహించేది లేదని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కొంతమంది పోలీసులు టిడిపి కార్యకర్త లపై అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారని, పద్ధతులు మార్చుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. టిడిపి నాయకులు సంయమనం పాటించాలని, దీర్ఘకాలికంగా అధికారంలో ఉండాలంటే గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించా లని చెప్పారు. కష్టకాలంలో పార్టీకి అం డగా నిలిచిన ప్రతి కార్యకర్తకూ న్యా యం చేస్తానని చెప్పారు. త్వరలోనే అన్ని ప్రభు త్వ శాఖలపై సమీక్షించి అక్రమాలపై చర్యలు తీసుకుంటామని, అవినీతికి పాల్పడిన గత ప్రభుత్వం తాలూకా ఫైళ్లను కనిపించకుండా చేసినా, కనిపించలే దంటూ సమాధానాలు చెప్పినా సంబం ధిత అధికారులను సర్వీసు నుండి తొలగిం చాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్ర మంలో టిడిపి పట్టణ అధ్యక్షులు కె.దుర్గా రావు, వజ్రం నాయక్‌, మదార్‌ సాహెబ్‌, ఎస్‌.ఎల్లమంద, వి.మురళి, అనంతరాము లు, ఎం.వెంకట్రామిరెడ్డి,అనిల్‌, సురేష్‌, పుల్లారావు, మొహిద్దిన్‌బాష పాల్గొన్నారు.

➡️