మాజీ ఎమ్మెల్యే ఆర్కే ప్రధాన అనుచరుడు దాసరి వీరయ్య అరెస్టు

Jun 29,2024 15:23 #arrested, #Dasari Veeraiah, #former MLA

గుంటూరు : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో జరిగిన టిడిపి కార్యకర్త షేక్‌ ఖాశీం హత్య కేసులో నిందితుడు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకఅష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెం గ్రామానికి చెందిన దాసరి వీరయ్య శుక్రవారం తెనాలిలోని కోర్టులో లంగిపోయారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించడంతో అతనిని రేపల్లె సబై జైలుకు తరలించినట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. జూన్‌ 4న ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గెలవడంతో చిలువూరు కార్యకర్తలు బైక్‌ లకు జెండాలు కట్టుకుని సందడి చేశారు. ఈ క్రమంలో ఖాశీం మరో యువకునితో కలిసి బండిలో పెట్రోలు పోయించుకునేందుకు చిలువూరు నుంచి రేవేంద్ర పాడు వెళుతుండగా తుమ్మపూడి వద్దకు రాగానే కొందరు వైసిపి కార్యకర్తలు బైకును ఆపి టిడిపి జెండా కట్టుకున్నందుకు కర్రలతో, క్రికెట్‌ బ్యాట్తో కొట్టారు. తలకు తీవ్ర గాయమైన ఖాశీం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మఅతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో యువకులను కొట్టేలా ప్రోత్సహించిన వీరయ్యపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుని భార్య ప్రస్తుతం దుగ్గిరాల జడ్పీటీసీ సభ్యురాలు కాగా, తల్లి చుక్కప ల్లివారిపాలెం సర్పంచిగా ఉన్నారు.

➡️