వైసిపితోనే సంక్షేమం సాధ్యం: ఎమ్మెల్యేలు

Apr 3,2024 21:45

ప్రజాశక్తి – పూసపాటిరేగ : వైసిపి ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యమవుతోందని నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్ధి బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. బుధవారం మండలంలోని పేరాపురం, పూసపాటిపాలెం, గొల్లపేటలో తొమ్మిదో రోజు వైసిపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు అందించే ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. మరోసారి నెల్లిమర్ల వైసిపి ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా బెల్లాన చంద్రశేఖర్‌ని ఆశీర్వదించాలన్నారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాలంటే ఈ ప్రభుత్వం మరలా రావాలన్నారు. ప్రచారంలో వైసిపి మండల అధ్యక్షలు పతివాడ అప్పలనాయుడు, వైస్‌ ఎంపిపిలు రమేష్‌, ఎన్‌.సత్యనారాయణరాజు, జెసిఎస్‌ కన్వినర్‌ మహంతి శ్రీనువాసరావు, పేరాపురం సర్పంచ్‌ రౌతు శ్రీరామూర్తి, నాయకులు మహంతి జనార్దనరావు, పుప్పాల లక్ష్మినారాయణ, దేశెట్టి గణేష్‌, పట్టెపు శ్రీనివాసరావు, యడ్ల రామకృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.బొత్స ఎన్నికల ప్రచారంగజపతినగరం: మండలంలోని పురిటిపెంటలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య బుధవారం ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలంటే సంక్షేమ పథకాలు మరల కొనసాగాలని దానికి అధికారంలో వైసిపి ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు బొత్స సాయిగురునాయుడు, జెడ్‌పిటిసి గార తవుడు, ఎంపిపి బెల్లాన జ్ఞానదీపిక, వైసిపి మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️