జగన్‌తోనే సంక్షేమం

May 1,2024 21:09

ప్రజాశక్తి- గరివిడి : ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డితోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ తనయుడు బొత్స సందీప్‌ అన్నారు. మండలంలోని వెదుళ్ల వలస ఉపాధి వేతనదారుల వద్దకు వెల్లి ఆయన బుధవారం ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సందీప్‌ మాట్లాడుతూ వెదుళ్లవలస గ్రామానికి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలోనే రూ.4 కోట్లతో సబ్‌ స్టేషన్‌ను 50 రోజులలో పూర్తి చేశామన్నారు. సిసి రోడ్లు, కాలువలు, చీపురుపల్లి, గర్భాం వరకు సుమరుగా రూ.9 కోట్లతో తారు రోడ్డు వేయిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణని, ఎమ్‌పిగా బెల్లాన చంద్రశేఖర్‌ని ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎఎంసి చైర్మన్‌ మీసాల విశ్వేశ్వరరావు, వైస్‌ ఎంపిపి గుడివాడ వెంకట శ్రీరాములునాయుడు, సర్పంచ్‌ గుడివాడ తమ్మినాయుడు, ఎయంసి డైరెక్టర్‌ బర్నాల సూర్యనారాయణ, నడుపూరి అప్పలనాయుడు, మన్నెపూరి లక్ష్మణరావు, మన్నెపూరి శ్రావణ్‌, బర్నాల సుగుణ తదితరులు పాల్గొన్నారు. డెంకాడ: వైసిపితోనే ప్రజా సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని అక్కివరం గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనని ఎమ్‌పిగా బెల్లాన చంద్రశేఖర్‌ ను ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల అవగానే తిరిగి అమెరికా వెళ్లిపోయే నాన్‌ లోకల్‌ వ్యక్తికి ఓటేస్తే ప్రమాదం అన్నారు. నిత్యం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరించే వ్యక్తులను ఎన్నుకోవాలన్నారు. వైసిపి అభ్యర్థులను గెలిపించాలని మండలం లోని బంగార్రాజు పేట, గొలగాం, గంట్లాం గ్రామాల్లో ఎంపిపి బంటుపల్లి వాసుదేవరావు, ఎమ్మెల్యే తనయుడు ప్రదీప్‌ నాయుడు, ఎమ్‌పి బెల్లాన కుమారుడు వంశీకృష్ణ బుధవారం ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి పిన్నింటి తమ్మి నాయుడు, సర్పంచులు రమణరాజు, బుర్లె అప్పలనాయుడు, సాడి ఈశ్వరరావు, బాలి సత్యనారాయణ, కంది త్రిమూర్తులు, పతివాడ సత్యనారాయణ, పాల్గొన్నారు.భోగాపురం: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసిపి ప్రభుత్వమేనని నెల్లిమర్ల నియోజకవర్గ వైసిపి అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని ఐదు పంచాయతీల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనా రాయణ రెడ్డితో కలిసి ఏ రావివలసలో ఉప్పాడ శివారెడ్డి, గూడెపు వలసలో కొల్లి రామ్మూర్తి, దల్లి పేటలో దల్లి శ్రీనివాసరావు, బైరెడ్డిపాలెంలో బైరెడ్డి యర్రప్పలనారాయణ, ప్రభాకర్‌ రెడ్డి, రెడ్డి కంచెరులో బైరెడ్డి రమణ, శీరపు గురునాద్‌ రెడ్డి, పోలిపల్లిలో కర్రోతు వెంకటరమణ, పతివాడ రామకృష్ణల ఆధ్వర్యంలో ప్రచారాన్ని చేపట్టారు. మూడోసారి తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. నాయకులు మణిదీప్‌ నాయుడు, పడాల, శ్రీనివాసరావు, సుందర హరీష్‌, భాను, గాలి రాజారెడ్డి, కర్రోతు శంకర్‌, పిన్నింటి చిన్న పాల్గొన్నారు.వైసిపిని మరోసారి ఆదరించి గెలిపించాలినెల్లిమర్ల: సార్వత్రిక ఎన్నికల్లో వైసిపిని మరోసారి ఆదరించి గెలిపించాలని ఎమ్మెల్సీ డాక్టర్‌ పి.సురేష్‌ బాబు కోరారు. బుధవారం ఆయన మండలంలోని మొయిద, పూతిక పేట, కొండగుంపాం, గరికిపేట, పారసం, బూరాడ పేట, చంద్రంపేట, కొండవెలగాడ గ్రామాల్లో వైసిపి అభ్యర్థి బడ్డు కొండ అప్పలనాయుడుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ సురేష్‌బాబు మాట్లాడుతూ ప్రజలందరూ మరోసారి ఎమ్మెల్యేగా బడ్డుకొండ అప్పల నాయుడును, ఎమ్‌పిగా బెల్లాన చంద్రశేఖర్‌ను గెలిపించా లని కోరారు. ఈ ప్రచారంలో వైసిపి మండల అధ్యక్షుడు చనమల్ల వెంకటరమణ, జెడ్‌పిటిసి గదల సన్యాసి నాయుడు. జిల్లా ప్రధాన కార్యదర్శి అంబల్ల శ్రీరాముల నాయుడు, వైస్‌ ఎంపిపిలు పతివాడ సత్యనారాయణ, సారికి వైకుంఠం, కోట్ల పైడినాయుడు, గిరిబాబు, సంతోష్‌ బాబు, చనమల్ల తులసి, రేగాన శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️