కోడిపందేలు నిర్వహిస్తే చర్యలు

Jan 10,2024 21:37

ప్రజాశక్తి – యలమంచిలి
మండలంలో ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహ శీల్దార్‌ ఎం. సునీల్‌కుమార్‌ హెచ్చ రించారు. మం డలం లోని కలగం పూడిలో కోడిపందేలు నిర్వహిం చే అవకాశమున్న అనుమానిత స్థలా లను ఆయన బుధవారం పరి శీలించారు. ఆయ నతో పాటు యలమంచిలి ఎస్‌ఐ కాకి శివన్నారాయణ, రెవెన్యూ అధికారులు ఉన్నారు. పాలకొల్లు రూరల్‌ :మండలంలో సంక్రాంతి పండుగ పేరుతో కోడిపందేలు, పేకాట, గుండాట వంటి జూదాలు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్‌ ఎస్‌ఐ ఎస్‌.శ్రీనివాస్‌ హెచ్చరించారు. మండలంలోని తహశీల్దార్‌, గ్రామ రెవెన్యూ అధికారుల సమావేశ భవనంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

➡️