ప్రజలకు విస్తృత సేవలందించాలి

జిల్లా ఇన్‌ఛార్జి రెవెన్యూ అధికారి శివన్నారాయణ రెడ్డి

ప్రజాశక్తి – భీమవరం

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ నమోదు, మార్పులు సేవలను ప్రజలకు విస్తృతంగా అందించాలని జిల్లా ఇన్‌ఛార్జి రెవెన్యూ అధికారి బి.శివనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా వార్డు, గ్రామ సచివాలయాల డిజిటల్‌ అసిస్టెంట్లకు, డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీలకు ఆధార్‌ నమోదుపై ఒక రోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందించేందుకు నిరుపేదలకు ఆధార్‌ కార్డు మూలమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ కేంద్రాలు నెలకొల్పిందన్నారు. మీ పరిధిలో కొత్తగా ఆధార్‌ నమోదు చేయడం, తప్పులుంటే సరిచేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వార్డు, గ్రామ సచివాలయాల అధికారి కెసిహెచ్‌ అప్పారావు, ఆధార్‌ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ వి.సుందరం, సహాయ సంచాలకులు బి.బాలు ప్రసాద్‌, జిల్లా కో ఆర్డినేటర్‌ సిహెచ్‌.సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️