రంగురంగుల హరివిల్లు ప్రజాశక్తి క్యాలెండర్‌

ఆవిష్కరణలో తారకరామా కన్‌స్ట్రక్షన్‌ అధినేత ఏసుబాబు
ప్రజాశక్తి – భీమవరం రూరల్‌
రంగురంగుల హరివిల్లు ప్రజాశక్తి క్యాలెండర్‌ అని తారకరామా కన్‌స్ట్రక్షన్‌ అధినేత పళ్ల ఏసుబాబు అన్నారు. స్థానిక జగనన్న కాలనీలో ఉన్న ఆయన కార్యాలయంలో ప్రజాశక్తి 2024 నూతన క్యాలెండర్‌ను ఆదివారం ఏసుబాబు ఆవిష్కరించి మాట్లాడారు. నూతన సంవత్సరంలో ప్రజాశక్తి నూతన హంగులతో రంగుల హరివిల్లుతో క్యాలెండర్‌ను ముద్రించడం అభినందనీయమన్నారు. నూతన ఏడాదిలో క్యాలెండర్‌ రూపంలో అందరికీ శుభాకాంక్షలు తెలపడం అనేది గొప్ప ఆలోచన అన్నారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాశక్తి పాఠకులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, రైతులకు క్యాలెండర్‌ను అందించడం అభినందనీయమన్నారు. పత్రికా రంగం ఇబ్బందుల మధ్య కొనసాగుతున్నప్పటికీ ప్రజాశక్తి మాత్రం వారి లక్ష్యానికి అనుగుణంగా అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ ముందుకు సాగుతుందన్నారు. నూతన ఏడాదిలో పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ప్రజాశక్తి యాజమాన్యానికి, ఉద్యోగులకు, సిబ్బందికి, విలేకర్లకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తారకరామా కన్‌స్ట్రక్షన్‌ వైస్‌ ఛైర్మన్‌ పళ్ల తారకరామ్‌, ప్రజాశక్తి ఎడివిటి జిల్లా ఇన్‌ఛార్జి పి.నారాయణరాజు, భీమవరం జిల్లా కేంద్రం విలేకరి యు.నరేష్‌, డివిజన్‌ ఇన్‌ఛార్జి జి.సాయి, భీమవరం రూరల్‌ విలేకరి జి.నాగరాజు, సర్క్యులేషన్‌ ఇన్‌ఛార్జి పెద్దిరాజు పాల్గొన్నారు.

➡️